దుర్గా నామస్మరణతో దేశం మొత్తం భక్తి పారవశ్యంలో మునిగి తేలుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక దుర్గామాతను ప్రతిష్టించుకున్న భక్తులు వారి అభివృద్ధికి తగ్గట్లుగా మండపం నిర్మించుకోవడం చేస్తూ ఉంటారు. అయితే ఒక గణేష్ మండపాలతో పోల్చి చూస్తే దుర్గామాత మండపాలు అంగరంగ వైభవంగా ముస్తాబు చేయడం కూడా చూస్తూ ఉంటాం. కొన్ని కొన్ని అయితే భూలోక స్వర్గాన్ని తలపించే విధంగా ఇలా మండపాలను సిద్ధం చేస్తూ ఉంటారు. ఇక కొంతమంది తమ క్రియేటివిటీని చూపిస్తూ ఇలా మండపం నిర్మించడం ద్వారానే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటారు. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి దుర్గామాత మండపం గురించే.
ఏకంగా మెట్రో ట్రైన్ లోనే దుర్గామాత మండపం పెట్టారు. అదేంటి మెట్రో ట్రైన్ లో దుర్గామాత మండపం ఏర్పాటు చేయడం అంటే అలా ఎలా పర్మిషన్ ఇస్తారు అని ఆశ్చర్యపోతున్నారు కదా. అయితే అది నిజమైన మెట్రో ట్రైన్ కాదు. ఏకంగా దుర్గామాత మండపాన్ని మెట్రో ట్రైన్ లాగా రూపొందించారు. క్రియేటివిటీకి కాదేది అనర్హం అనట్లుగా పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో భక్తులు ఇలా వినూత్నంగా దుర్గామాత మండపం రూపొందించారు. అచ్చం మెట్రో రైలును పోలి ఉన్నట్లుగా మండపాన్ని తీర్చిదిద్దారు. ఇందులోకి వెళ్తే మెట్రోలోనికి వెళ్ళిన అనుభూతిని ఇస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇది చూసి నెటిజెన్స్ అందరు కూడా ఆశ్చర్యపోతున్నారు.