మనం పుస్తకాల్లో చదువుకున్న విషయాలు రెగ్యులర్ గా మాట్లాడుకునే ఎన్నో సామెతలు కొన్ని కొన్ని సార్లు రియల్ లైఫ్ లో కూడా నిజం అవుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇలాంటిది ఏదైనా జరిగింది అంటే చాలు అది సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోతూ ఉంటుంది. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. బలమైన సర్పము చలిచీమల చేత జిక్కి చావదు సుమతి అనే ఒక పద్యం మీరు పుస్తకాల్లో చదువుకునే ఉంటారు.


 ఎంత బలమైన సర్పము అయినా సరే కూడా అటు చలి చీమల చేత చిక్కి చనిపోతూ ఉంటుంది అని ఇక ఈ పద్యానికి అర్థం వస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు అది నిజమైంది. అయితే ఈసారి చలి చీమలు కాదు బలవంతమైన సర్పాన్ని ఒక సాలీడు చంపేసింది  అదేంటి సాలీడు చిన్న ఆకారంలో ఉంటుంది. బలమైన సర్పాన్ని ఎలా చంపగలదు. దానికి అంత బలం ఎలా సరిపోతుంది అని అనుకుంటున్నారు కదా. కానీ ఇక్కడ ఒక సాలిడు బలమైన భారీ భారీ పామును బంధించి చంపేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇది చూసి నేటిజన్స్ సైతం షాక్ అవుతున్నారు.



 ఇలా వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటే ఒక చెట్టు పైనుంచి తీగల పైకి ఎక్కుతుంది ఒక భారీ సర్పం. ఇక ఆ తీగల పైన పాకుతూ వెళ్తుంది. ఇలాంటి సమయంలోనే ఒక సాలీడుకు చిక్కింది. తీగల మీద పాకుతూ వెళ్లిన పాము చివరికి అక్కడ ఉన్న సాలీడు గూడులో చిక్కుకుపోయింది. సాలీడుతో కాసేపు పోరాడిన చివరికి మాత్రం ఆ చిన్న సైజులో ఉన్న సాలిడికి  దక్కింది. అయితే పాము ఎంతలా గంజుకుంటున్న సాలీడు మాత్రం ఎంతో తెలివిగా వ్యవహరించి చివరికి ఆ భారీ పామును కూడా తన దారాలతో కదలకుండా చేసేసింది. ఇక ఈ వీడియో వైరల్ గా మారగా ఎంత బలవంతుడైన సరే తనదైన రోజు కాని రోజు ఇక ఇలాఎదురు దెబ్బ తినాల్సిందే అంటూ ఎంతో మంది నేటిజన్స్ ఈ వీడియో పై కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: