ఈ రోజుల్లో ధనవంతులు కూడా టమాటా కర్రీ వండాలంటే ఒక్క క్షణం ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం వీటి రేటు చూసి వినియోగదారులు దడుసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా టమాటాలను ముట్టుకుంటే చాలు భగ్గుమంటున్నాయి. ఇక సామాన్యులు, ఎక్కువ మంది కుటుంబ సభ్యులు ఉన్న వారికి టమాటాలే ఊరట. కానీ ఇప్పుడు వాటి ధర చూస్తే సామాన్యుల ఊపిరి ఆడటం లేదు. గత కొన్ని రోజులుగా వీటి ధర మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశమంతటా కిలో రూ. 100 పలికింది.ఈ నేపథ్యంలో టమాటా ధరలు భారీగా పెరుగుతోన్నాయి. నెలన్నర క్రితం వరకు కిలో రూ.20 నుంచి రూ.30 పలికిన టమాటా ధర ఇప్పుడు భారీగా పెరిగింది. గత పదిహేను రోజుల్లో అయితే ఈ కూరగాయ ధర డబుల్ అయింది. ప్రస్తుతం హోల్ సెల్ మార్కెట్ లో కిలో టమాటా రూ.70 నుంచి రూ.80 పలుకుతోంది. ఇక రిటైల్ అయితే రూ.100 దాటినట్లు తెలుస్తోంది. డిమాండ్ కు సరిపడ టమాటా రాకపోవడమే ఇందుకు కారణమని కూరగాయ వ్యాపారులు చెబుతున్నారు.ఈ నేపథ్యంలో ఆ మధ్య కురిసి భారీ వర్షాలకు టమాటా పంటలు దెబ్బతిన్నాయని.. దీంతో ధరలు అమాంతం పెరిగాయని పేర్కొంటున్నారు. 

హైదరాబాద్ కు తెలంగాణలోని జిల్లాల నుంచి కాకుండా రాయలసీమ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి టమాటా వస్తుంది. ఇతర రాష్ట్రాల నుంచి పంట రాక తగ్గడంతో పాటు.. రాష్ట్రంలో పంట దిగుబడి తగ్గడంతో ధరలు పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. సాధారణంగా టమాటా ధర వేసవి కాలంలో ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ధర తక్కువగా ఉండాలి.భారీ వర్షాలతో దిగుబడి తగ్గి ధర పెరిగినట్లు చెబుతున్నారు. ఈ ధరలు మరో నెల పాటు కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు. కొత్త పంట చేతికి వచ్చే వరకు ఇవే ధరలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఉల్లి ధరలు కూడా భారీగానే పెరిగింది. రిటైల్ మార్కెట్ లో కిలో ఉల్లి రూ. 60 నుంచి రూ.70 పలుకుతోంది. కేంద్రం ఉల్లి ఎగుమతి పై సుంకం ఎత్తివేయడంతో ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఏపీ లో పలువురు మందుబాబులు ఫన్నీ గా సెటైర్లు వేస్తున్నారు. కేజీ టమాటా కొనే కంటే రూ. 99కి ఒక క్వార్టర్ మద్యాన్ని కొనుక్కోవచ్చని కామెంట్స్ చేస్తున్నారు.క్వాటర్ మద్యం రూ.99కే విక్రయించనున్నట్లు ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: