దేశవ్యాప్తంగా అశ్లీల దృశ్యాలు చూసే వారి సంఖ్య పెరిగిపోతోంది. సెల్ ఫోన్, ల్యాప్‌ ట్యాప్‌ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇంటర్నెట్ సౌకర్యం అందరికీ అందుబాటులోకి రావడంతో పోర్నోగ్రఫీ చూసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది.ఇదిలావుండగా టెలి'విజన్' అందరికీ ప్రపంచం అంటే ఏంటో తెలియజేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ప్రపంచంలో జరిగే ఎన్నో వింతలను, విశేషాలను ప్రతిరోజూ మన కళ్ల ముందు కట్టినట్టు చూపింది. చూపుతోంది. పిల్లలు, పెద్దలు, యువత అనే తేడా లేకుండా అందరినీ తన కంట్రోల్ లోకి తెచ్చుకుంది.ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు దాని మీదే ఆధారపడేలా చేసింది. సీరియల్స్ నుండి సినిమాలు, క్రికెట్, రియాలిటీ షోలు, ఇతర కార్యక్రమాల పేరిట అందరినీ టివికి అతుక్కుపోయేలా చేసింది.ఈ నేపథ్యంలో టెలివిజన్‌ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే ఉపకరణం. వినోదం కోసం ఏర్పాటుచేసుకునే టీవీలో అనూహ్యంగా అభ్యంతకర రీతిలో అసభ్య వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. కుటుంబసభ్యులు అంతా కలసి చూస్తున్న సమయంలో అనూహ్యంగా ప్రత్యక్షమైన అశ్లీల వీడియోతో ఇబ్బందులు పడ్డారు. ఇలా ఒక్కసారి కాదు రెండు కాదు పలుమార్లు అశ్లీల వీడియోలు ప్రసారమవుతుండడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని నందికొట్కూరులో చోటుచేసుకుంది.

నందికొట్కూరు పట్టణంలో ఫిరోజ్ డిష్ కేబుల్ సర్వీసు ఉంది. పట్టణంలో వీరి డిష్‌ టీవీని సబ్‌స్క్రిప్షన్‌ చేసుకున్న ఇళ్లకు టీవీ ప్రసారాలు జరుగుతున్నాయి. అయితే ఇటీవల టీవీలో ప్రసారాలు చూస్తుండగా అనూహ్యంగా అశ్లీల దృశ్యాలు వచ్చాయి. నీలి చిత్రాలు దాదాపు కొన్ని నిమిషాల పాటు ప్రసారమయ్యాయి. సినిమా చూస్తున్న క్రమంలో ఇలాంటి వీడియోలు రావడంతో కుటుంబసభ్యులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరు వెంటనే టీవీని ఆఫ్‌ చేశారు. మరికొందరు ఆ దృశ్యాలను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు.అశ్లీల చిత్రాలు ప్రసారం చేసిన డిష్‌ నిర్వాహకులపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదుతో నందికొట్కూరు పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. పరిటాలకు చెందిన ఫైబర్ నెట్ నిర్వాహకుడు ఫిర్యాదులో వాస్తవం ఏం జరిగిందో వివరించారు. ఉదయం పూట సినిమా చూస్తుండగా మధ్యలో 30 నిమిషాలు నీలి చిత్రాలు వచ్చాయని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ దృశ్యాలకు సంబంధించిన ఆధారాలను కూడా పోలీసులకు అందజేశారు. దసరా సెలవులతో ఇంటిల్లిపాది టీవీ చూస్తున్న సమయంలో ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడం సరికాదని పేర్కొన్నారు.అయితే ఒకరి నిర్వాకం వల్ల ఈ సంఘటన చోటుచేసుకుని ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. స్థానికులు ఆదరిస్తున్న ఈ డిష్‌ కేబుల్‌లో ఇలాంటివి రావడం మొదటిసారని పేర్కొంటున్నారు. కాగా టీవీల్లో అశ్లీల ప్రసారాల వీడియోలు కాస్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: