కొన్ని ప్రత్యేక వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారతాయి. అది వారి ప్రవర్తనతీరుపై ఆధారపడి ఉంటుండి. ఇలాంటి అనేక వీడియోలు సోషల్‌ మీడియా వేదికగా ఎన్నో చూస్తుంటాం. ప్రస్తుతం సోషల్ మీడియా అనేది ప్రజల జీవితాల్లో ఓ భాగం అయిపోయింది. పెద్దా, చిన్నా అనే తేడా లేకుండా అందరూ యూట్యూబ్, ఫేస్‌బుక్, సోషల్ మీడియా, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాలతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. సోషల్ మీడియాకు ఒక్కసారిగా క్రేజ్ పెరగడంతో దానిని ఉపయోగించుకుని పాపులర్ అయ్యేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అందమైన అమ్మాయి బైకు ఆపడంతో యువకుడు సంబరపడ్డాడు. అయితే చివరకు ఆమె ఇచ్చిన ట్విస్ట్‌ తెలుసుకుని అవాక్కయ్యాడు.సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ అందమైన యువతి రోడ్డు పక్కన నిలబడి.. ఎవరైనా లిఫ్ట్ ఇస్తారేమో అని ఎదురుచూస్తుంటుంది. ఇంతలో ఎదురుగా బైకు రావడం చూసి చేయి ఎత్తి లిఫ్ట్ అడుగుతుంది. అందమైన అమ్మాయి బైకు ఆపడం చూసి సదరు యువకుడు సంబరపడిపోయి బండిని ఆపుతాడు.

అయితే ఇక్కడే ఆమె అతడికి పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. బైకు వెనుక ఆమె కూర్చోకుండా.. ఓ వృద్ధుడిని పిలిచి కూర్చోబెడుతుంది. అయితే ఇదంతా గమనించిన ఆ యువకుడు.. ఆమ్మాయే బైకుపై కర్చుందనే ఆనందంతో సంబరంగా డ్రైవ్ చేస్తుంటాడు. మధ్య మధ్యలో సడన్‌ బ్రేకులు వేస్తూ ఎంజాయ్ చేస్తుంటాడు. అయితే కాస్త దూరం వెళ్లిపోయాక.. అనుమానం వచ్చి బైకును ఆపి వెనక్కు చూస్తాడు. వెనుక వైపు అమ్మాయి బదులుగా తాతయ్య ఉండడం చూసి ఖంగుతింటాడు.ఇలా ఆ యువతి అతడికి వినూత్నంగా షాక్ ఇచ్చింది. ఇదంతా వ్యూస్, లైకుల కోసం కావాలని చేసినా.. వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ''ఈ యువతి భలే షాక్ ఇచ్చిందిగా''.. అంటూ కొందరు, ''పాపం అమ్మాయే అనుకుని ఊహల్లో తేలిపోయాడు''.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2వేలకు పైగా లైక్‌లు, 4 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.దీంతో ఈ వీడియో కాస్త తెగ వైరల్‌ అయ్యింది. ఈ వీడియో చూసిన నెటిజన్లుపిచ్చి పీక్స్‌కి చేరిందని కామెంట్స్‌ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: