ఈ మధ్యకాలంలో సైన్స్ ఫిక్షన్ జానర్ లో వస్తున్న సినిమాలకు ఏ రేంజ్ లో క్రేజ్ ఏర్పడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి సినిమాలలో ఉండే అద్భుతమైన సన్నివేశాలను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు. అయితే ఇలాంటి సైన్స్ ఫిక్షన్ సినిమాలలో మిషన్లు మనుషులను మించిన తెలివితేటలను ప్రదర్శిస్తూ ఉండడం చూస్తూ ఉంటాం. శంకర్ దర్శకత్వంలో వచ్చిన రోబో సినిమాలో ఒక మనిషి ఏదైతే చేయగలడో అలాంటి పనులు అన్నీ కూడా ఒక రోబో చేస్తుంది అని చూపిస్తూ ఉంటారు.


 సినిమాలలో ఇలాంటి సన్నివేశాలను చూసి వావ్ అని అనాలి అనిపిస్తూ ఉంటుంది  అయితే ఇక మొన్నటి వరకు రోబో లో చూసిన ఇలాంటి అద్భుతమైన సన్నివేశాలు ఇక ఇప్పుడు నిజం కాబోతున్నాయి. ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల ఆర్టిఫిషియల్ రోబోలు అందుబాటులోకి వచ్చాయ్. అయితే రోబో సినిమాలో చూపించినట్లుగానే ఇటీవల ఎలాన్ మస్క్ తయారుచేసిన ఒక రోబో కి సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది. వీటి పేరు ఆప్టిమస్ అచ్చం మనిషిలాగ కనిపిస్తుంటుంది ఈ రోబో. కేవలం కనిపించడం మాత్రమే కాదు  ప్రవర్తన తీరు కూడా మనుషుల్లాగే ఉంటుంది.


 ఇక ఇప్పుడు ఈ రోబో సోషల్ మీడియాలో తెగ పాపులారిటీ సంపాదించింది. ఏకంగా మనుషులతో మనిషిలాగే మాట్లాడుతూ.. ఏకంగా మనిషిలాగే ప్రవర్తిస్తూ ఉన్న ఈ రోబోను చూసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అయ్యారు. ఈ క్రమంలోనే రోబో ఎలా ప్రవర్తించింది అన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. కాగా కొంతమంది ఈ వీడియో పై ఫన్నీ కామెంట్లు చేస్తుంటే.. ఇంకొంతమంది అటు ఎలాన్ మస్క్ ఇలా ఏఐ రంగాలలో అతిపెద్ద ముందడుగు వేశారు అంటూ అభినందిస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రోబో పై ఒక లుక్ వేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: