ప్రస్తుతకాలంలో సోషల్ మీడియా అనేది అందరి జీవితంలోనూ ఓ భాగమైంది. ప్రపంచంలో ఏ మూలాన చీమ చిటుక్కుమన్నా.. సెకన్లలో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడతాయి. ప్రస్తుతం అలాంటి ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో వేదికగా కొందరు మంచి కంటెంట్‌ను జనాలకు పంచుతుంటే.. ఇంకొందరు కొంచెం హద్దుదాటి.. అసభ్యకరంగా ప్రవర్తిస్తూ తమ ప్రైవేట్ వీడియోలను సైతం షేర్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు తాజాగా ఓ కొత్త జంట తమ ఫస్ట్ నైట్‌ వ్లోగ్‌ను నెటిజన్లతో పంచుకున్నారు.ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారిపోయింది.ఆ నూతన దంపతులు తమ ఫస్ట్ నైట్ రోజే వ్లాగ్ చేశారు. ఆ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. నాలుగు గోడల మధ్యన జరగాల్సిన ఫస్ట్ నైట్ విషయాలను సోషల్ మీడియాలో పంచుకోవడమేంటని చీవాట్లు పెడుతున్నారు. మరికొందరు ‘నైస్‌, క్యూట్‌ కపుల్‌’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ‘వ్లాగ్స్ సాంప్రదాయం పెళ్లి నుంచి ఫస్ట్ నైట్ వరకూ చేరిందన్నమాట’ అని కొందరు కామెంట్‌ చేస్తే.. ‘వీళ్ల పిచ్చి పీక్స్‌కు వెళ్లింది’ అని మరికొందరు విమర్శిస్తున్నారు.ఈ వీడియో హస్నా జరూరిహై అనే ఖాతాలో షేర్ చేయబడింది. ఇది వెడ్డింగ్ నైట్ బెడ్‌రూమ్ వీడియో.

ఇందులో ఇద్దరూ పెళ్లి బట్టలు విప్పుతున్న దృశ్యం రికార్డయింది. అవును, వధువు ఆభరణాలను తీసివేయడంలో వరుడు సహాయం చేస్తాడు. వధువు రొమాంటిక్ మూడ్‌లో వరుడిని ముద్దు పెట్టుకుంది. వధూవరులు ఒకరినొకరు ముద్దులు పెట్టుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కొత్తగా పెళ్లయిన జంట తమ పెళ్లి రాత్రికి సంబంధించిన వీడియోను కెమెరాలో బంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియో ఇరవై ఏడు వేలకు పైగా వీక్షణలను చూసింది మరియు నెటిజన్ల నుండి రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు.
'ఈ కొత్త జంట నైతికతను దాటిపోయింది' అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. 'ఇటీవల సంస్కృతినే మరిచిపోతున్నారు' అని మరొకరు వాపోయారు. మరొకరు 'ఇది మన సంస్కృతి' అని రాశారు. దీంతో ఈ కొత్త జంట ఓ ప్రైవేట్ వీడియోను షేర్ చేసినందుకు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.ఇలా ఎవరూ చేయని విధంగా ఫస్ట్ నైట్ రోజున వీళ్లు చేసిన వ్లాగ్‌పై నెటిజన్లు విభిన్న స్పందనలు తెలిపారు.ఇదిలావుండగా రీల్స్ చెయ్యడానికి ఓ హద్దు ఉంటుందని, ఏకాంతంగా జరగవలసిన ఫస్ట్ నైట్ ను వీవ్స్ కోసం, లైక్స్ కోసం ఇలా ప్రైవేట్ విషయాలను, వ్యక్తిగత విషయాలను, బెడ్ రూమ్ లో భార్యకు సంబంధించిన విషయాలను పబ్లిక్ గా చెయ్యడం వీడి మూర్ఖత్వాన్ని ఎత్తి చూపిస్తోందని క్లాస్ పీకారు. ప్రైవేట్ క్షణాలు, ప్రైవేట్ విషయాలు రహస్యంగా ఉంచాలని, ఇలా సిగ్గులేకుండా బహిరంగంగా చర్చించకూడదని, నేటి యువతకు మీరు ఏం మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నారని కొందరు నెటిజన్లు ఆ దంపతుల మీద మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: