కోవిడ్ అనే పేరు వింటే చాలు ప్రజలకు ఇప్పటికీ భయభ్రాంతులకు గురవుతూ ఉంటారు.. అయితే కోవిడ్ -19 ఇంజక్షన్ చాలామంది వేయించుకోవడం జరిగింది. దీంతో ప్రజలు అయితే ఊపిరి పీల్చుకున్నప్పటికీ రాను రాను ఈ ఇంజక్షన్ వల్ల జరిగి అనార్ధాలు ఇవేనంటూ పలు రకాల వార్తలయితే వినిపిస్తూ ఉన్నాయి.. ముఖ్యంగా ఎక్కువ మంది గుండెపోటు, సడన్ స్ట్రోక్ వంటి కారణాలవల్లే మరణించే వారి సంఖ్య ఎక్కువ అవుతోంది. దీంతో అమెరికా పరిశోధకులు తాజాగా కొన్ని విషయాలను తెలియజేశారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ప్రమాదాలు ఉన్నాయా లేవా అనే విషయాలను కూడా తెలిపారు వాటి గురించి చూద్దాం.


అయితే ఈ పరిశోధనలు అమెరికాకు చెందిన NIH పరిశోధనలో భాగంగా గుండెపోటు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని నిర్ధారించారు. కోవిడ్ సోకిన తర్వాత ఈ ఇన్ఫెక్షన్ వల్లే మూడేళ్ల పాటు ప్రమాదం పొంచి ఉంటుంది అంటూ పరిశోధకులు తెలియజేశారు. వైరస్ సోకిన వారితో పోలిస్తే మహమ్మారి ప్రారంభంలో కోవిడ్-19 బారిన పడిన వ్యక్తులకు చాలా ప్రభావం చూపిస్తోందని తెలిపారు. ముఖ్యంగా గుండె జబ్బుల బారిన పడే వారి సంఖ్య పెరుగుతోందని కూడా తెలిపారు.

కోవిడ్ 19 తర్వాత బ్లడ్ గ్రూప్..A,B వ్యక్తులు గుండెపోటు లేదా స్ట్రోక్ వచ్చే అవకాశం రెండు రెట్లు కాస్త ఎక్కువగా ఉన్నట్లు తెలియజేశారు.. అయితే ఓ బ్లడ్ గ్రూప్ వారికైతే ఈ ప్రమాదం కాస్త తక్కువగానే ఉంటుందని వెల్లడించారు. కరోనా బారిన పడ్డ రోగులలో గుండెకు సంబంధించిన వారు ఉంటే స్ట్రోక్ వచ్చే ప్రమాదం నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు. మూడు సంవత్సరాలుగా ఈ పరిశోధనలు ఈ విషయాలను గుర్తించామంటూ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కోవిడ్ బారిన పడ్డారని తీవ్రమైన కోవిడ్ 19 వల్లే గుండె జబ్బులు వస్తున్నాయని నిర్ధారించారు. అలాగే టైప్-2 డయాబెటిస్ లేదా ఫెరిఫరల్ ఆర్టజీ డిసీజ్ వంటివి కూడా వస్తున్నాయంటూ తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: