బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‏కు పాన్ ఇండియా ఫ్యాన్స్ ఉన్నారన్న సంగతి తెలిసిందే. దక్షిణాదిలోనూ సల్లుభాయ్ కి మంచి క్రేజ్ ఉంది. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో కీలకపాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించారు సల్మాన్. ఇదిలా ఉంటే.. సల్మాన్ చేతికి ఉండే బ్రాస్లెట్ ఎప్పుడైనా గమనించారా ?. సల్మాన్ అభిమానులను ఈ బ్రాస్లెట్ ఆకట్టుుకుంటుంది. సిల్వర్ కమ్ బ్లూ స్టోన్ బ్రాస్లెట్ ధరిస్తారు సల్మాన్. అయితే దానిని ధరించడం వెనక పెద్ద కథే ఉంది.ఇదిలావుండగా సల్మాన్ ఖాన్ ప్రస్తుతం బిగ్ బాస్ 18వ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. టెలివిజన్‌ చరిత్రలోనే అతిపెద్ద రియాల్టీ షో ఇది. ఇదే కాకుండా సల్మాన్ ఖాన్ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టుల ఉన్నాయి.అందులో సికిందర్ ఒకటి. మురుగదాస్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది.

హిందీ చిత్రసీమలో సల్మాన్‌ ఖాన్‌కు మంచి డిమాండ్‌ ఉంది. ఆయన బాలీవడ్ లో సూపర్ స్టార్ గా వెలుగొందుతున్నాడు. ఓ వైపు లు చేస్తూనే, మరోవైపు బిగ్ బాస్ వంటి ప్రముఖ టీవీషోల్లోనూ మెరుస్తున్నాడు. ఈ కారణంగానే సల్మాన్ కు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు.అయితే ఇటీవల తన సన్నిహితుడు బాబా సిద్ధిఖీ హత్యతో సల్మాన్ ఖాన్ బాగా కలత చెందాడు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాబాను హత్య చేసినట్లు అధికారికంగా ప్రకటించుకుంది.కాగా సల్మాన్ ఖాన్ చేతికి ఎప్పుడూ బ్రాస్లెట్ ఉంటుంది. తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగానే ఆయన దానిని ధరిస్తున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఈ బ్రాస్లెట్ ధరించడం వల్ల ప్రతికూల అంశాలు తొలగిపోతాయని సల్మాన్ నమ్ముతున్నాడట.

 ఈ బ్లూ కలర్ స్టోన్ బ్రాస్లెట్ ధరించడం వెనుక రహస్యాన్ని సల్మాన్ ఖాన్ ఒక సందర్భంలో బయటపెట్టాడు 'మా నాన్న ఎప్పుడూ ఇలాంటి బ్రాస్‌లెట్‌ను ధరించేవారు. అందుకే నేను కూడా ధరిస్తున్నాను' అని చెప్పుకొచ్చాడు సల్లూ భాయ్.సల్మాన్ ఖాన్ చాలా ఏళ్లుగా తన కుడి చేతికి బ్రాస్‌లెట్‌ను ధరించాడు. ఈ రత్నాన్ని ఫిరూజా అని పిలుస్తారు. దీనిని ధరించడం అదృష్టమని, కష్టాల తొలగిపోతాయని సల్మాన్ నమ్ముతున్నాడట.తనపై ఏదైనా నెగిటివిటీ వస్తే దానిని అడ్డుకుంటుందని..తనపై వచ్చే చెడు దృష్టిని ఆ రాయి తీసుకుంటుందని.. ఆ తర్వాత అది బ్రేక్ అవుతుందని చెప్పారు. అలాగే తాను ఇప్పటికీ 7 స్టోన్స్ మార్చినట్లు  చెప్పారు సల్మాన్.బ్రాస్లెట్ తనకు చాలా ప్రత్యేకమని.. అందులో ఉండే రాయి ఫిరోజా రాయి అని అన్నారు సల్మాన్. ప్రపంచంలోని రెండు సజీవ రాళ్లలో ఈ ఫిరోజా రాయి ఒకటి. ఇది చాలా అరుదైన రాయిని అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: