టాటా గ్రూప్స్ మాజీ  చైర్మన్ రతన్ టాటా మరణం యావత్ భారతదేశాన్ని తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది.. దేశంలోనే అత్యంత విలువైన వ్యాపార సామ్రాజ్యానికి అధినేతగా పేరుపొందిన రతన్ టాటా కొన్ని వేలకోటకు ఆస్తిపరుడు.. ఎంతోమంది పేద ప్రజలకు సహాయం చేశారు. తనను విమర్శించిన వాళ్లకు కూడా మేలు చేసిన ఘనత పొందారు రతన్ టాటా.. 86 ఏళ్ల వయసులో రతన్ టాటా మరణించడం జరిగింది. అక్టోబర్ సోషల్ మీడియా వేదికగా చాలామంది సెలబ్రిటీలు ప్రజలు కూడా నివాళులు అర్పించారు.


అయితే రతన్ టాటా మరణానికి గల కారణాలు ఏంటి అనే విషయాన్ని ఇటీవల రిపోర్ట్ లో తెలియజేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. రతన్ టాటా కు బ్లడ్ ప్రెజర్ ఎక్కువగా కావడం వల్ల చికిత్స కోసం ఆయనను ముంబైలోని బ్రీచ్ కండి ఆసుపత్రికి తరలించారట.. అయితే అక్కడ ఐసీయూలో రతన్ టాటా ను చేర్పించడంతో అదే రోజున రతన్ టాటా బాగున్నాను అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ను కూడా షేర్ చేశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నప్పటికీ ఆ మరుసటి రోజు తాను మరణించినట్లుగా న్యూస్ వైరల్ గా మారింది.

రతన్ టాటా అక్టోబర్ 9వ తేదీన రాత్రి 11:30 నిమిషాలకు వయసుకు సంబంధించిన పలు అనారోగ్య సమస్యలకు తోడుగా బ్లడ్ ప్రెషర్ వల్ల మరణించారని వైద్యులు అంచనా వేస్తున్నారు... అయితే రతన్ టాటా చనిపోవడానికి రెండు రోజుల ముందు నుంచి బ్లడ్ ప్రెషర్ వల్ల అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడ్డారట.. తక్కువ రక్తపోటును హైపోటెన్షన్ అని పిలుస్తారట.. ఇది పెద్దవాళ్లలో ఎక్కువగా ప్రమాదాలను సృష్టిస్తుంది. ఇది సైలెంట్ కిల్లర్ అని కూడా చెప్పవచ్చు.. దీనికి చికిత్స చేయకుండా వదిలేస్తే చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తాది.. లో బీపీ కూడా సమయానికి చికిత్స అందించకపోతే చాలా ప్రాణాంతకంగా మారుతుందని వైద్యులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: