ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం సంపాదించేందుకు అభ్యర్థులు ఎంతగానే శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో ఉద్యోగానికి సరిపడా క్వాలిఫికేషన్‌ లేదనే కారణంతో చాలా మంది రిజక్షన్‌కు గురవుతుంటారు.ఎవరికైనా ఉద్యోగం దొరకలేదంటే టాలెంట్ తక్కువై ఉంటుందనో లేదా పోటీ ఎక్కువగా ఉందనో అనుకుంటాం. కానీ ఓ యువతికి టాలెంట్ ఎక్కువ కావడంతో ఉద్యోగం దక్కలేదు.గూగుల్‌లో జాబ్‌కు దరఖాస్తు చేసుకున్న ఓ యువతికి ఎదురైన వింత అనుభవం ఇది. టాలెంట్ ఎక్కువైనందుకే జాబ్ ఇవ్వలేకపోతున్నామంటూ గూగుల్ పంపించిన లేఖను కూడా మహిళ షేర్ చేసింది. ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.దిల్లీకి చెందిన అను శర్మ గూగుల్‌లో పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఓ స్టార్టప్‌ కంపెనీలో ఉద్యోగానికి ఆమె దరఖాస్తు చేసున్నారు. కొన్ని రోజుల తర్వాత అమె దరఖాస్తును రిజెక్ట్ చేస్తున్నట్లు ఆ కంపెనీ మెసేజ్ చేసింది. అయితే, అందుకు ఆ కంపెనీ చెప్పిన కారణం ఆమెను ఆశ్చర్యపర్చింది.

 'మీ దరఖాస్తును సమీక్షించిన తర్వాత మీ క్వాలిఫికేషన్‌ ఉద్యోగ అర్హతకు మించి ఉందని తెలిసింది. అధిక అర్హతలు ఉన్న అభ్యర్థులు తరచూ తమ పనిలో అసంతృప్తితో ఉంటూ.. కొన్ని రోజులకే వెళ్లిపోతారని మా అనుభవంలో తెలుసుకున్నాం' అని ఆ కంపెనీ బదులిచ్చింది. ఈ మెసేజ్‌ను ఎక్స్‌లో షేర్‌ చేసిన అను శర్మ.. 'మంచి అర్హత కలిగి ఉంటే రిజెక్ట్ అవుతారని నాకు తెలియదు' అని రాసుకొచ్చింది.ఈ సందేశం తాలూకు వీడియోను నెట్టింట షేర్ చేసిన అనుష్క.. ఆశ్చర్యం వ్యక్తం చేసింది. టాలెంట్ ఎక్కువైనందుకు జాబ్ లభించని ఘటనలు కూడా ఉంటాయని నాకు తెలీదు'' అని ఆమె పోస్ట్ చేసింది.ఇక సహజంగానే ఈ ఉదంతంపై నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అనేక మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొందరు సెటైర్లు పేల్చారు. అయితే, జాబ్ తిరస్కరణకు గురికావడం దైవఘటనగా భావించాలని ఓ వ్యక్తి అన్నాడు. ఈ అనుభవంతో సొంత సంస్థ స్థాపించుకుని వృద్ధిలోకి రావాలని సూచించాడు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో తెగ వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: