మనలో ఎవరన్నా కొంచెం తేడాగా బిహేవ్ చేస్తే, కోతి చేష్టలు చేయకు! అంటూ మందలిస్తాము. ఎందుకంటే మనిషికి, కోతికి కాస్త దగ్గర పోలికలు ఉంటాయి కాబట్టి. అయితే కోతి చేష్టలు గురించి డైరెక్ట్ గా చూసినపుడు అది నిజమే అని అనిపిస్తుంది. అలాంటి కోతుల వీడియోలు అపుడపుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. తెలసీ తెలియక అవి చేసే తింగరి పనులు చూసే వారికి నవ్వు తెప్పించినప్పట్టికీ కొన్ని సార్లు అవి ప్రమాదాల్లో పడుతూ ఉంటాయి. అవును, సర్కస్‌ ఫీట్స్ చేసే వానరాలను మీరు చూసే ఉంటారు. ఆలయాల్లో భక్తుల నుంచి ప్రసాదాలు లాక్కెళ్లిపోయే కోతుల్ని కూడా మీరు చూసే ఉంటారు. ఆయా వీడియోలు నిత్యం నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి.

ఈ క్రమంలోనే తాజాగా ఓ కోతి.. పాముతో యుద్ధానికి దిగి తగిన మూల్యం చెల్లించుకుంది. ఇపుడు దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. వైరల్ అవుతోన్న వీడియోను గమనిస్తే, కొబ్బరి చెట్టు ఎక్కిన కోతికి చెట్టు తొర్రలో ఒక పాము కనిపించింది. పామును చూడగానే కోతి పెద్దగా భయపడకుండా తొర్రలోకి దూరి మరీ ఆ పాము తోకను లాగే ప్రయత్నం చేసింది. అలా లాగగానే పాము బుసలు కొడుతూ.. వానరంపైకి ఎదురు దాడికి దిగింది. ఈ క్రమంలో కోతి తలపై కట్టిగా కరిచి పట్టుకుంది. దీంతో బిత్తరపోయిన కోతి, విడిపించుకోవడానికి నానాతంటాలు పడింది.

అయితే అలా పాము కోతిని వదలకుండా గట్టిగా కరవడంతో నొప్పితో విలవిల్లాడిన కోతి.. చివరకు ప్రాణం మీదకు రావడంతో.. తన శక్తిని అంతా పోగేసి మరీ పామును గట్టిగా పక్కకు లాగేయడం మనకి ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత పాము అక్కడి నుంచి పారిపోవడం మనకి కనిపిస్తుంది. అయితే అప్పటికే పాము చేసిన పనికి పగ పెంచుకున్న కోతి, పారిపోతున్న పామును పట్టుకుని మరీ మళ్లీ కొరికేందుకు ప్రయత్నిస్తుంది. దాంతో ఈ వీడియో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేయడం మనం గమనించవచ్చు. ఎక్కువ మంది 'కోతి చేష్టలు' అంటే ఇవే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.








మరింత సమాచారం తెలుసుకోండి: