పాఠశాల విద్యార్థులకు ఈమధ్య వరుసగా సెలవుల తో ఫుల్ ఖుషి అవుతున్నారు.. ఒకవైపు దసరా సెలవులు మరొకవైపు వరదల కారణంగా సెలవులు కూడా వస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా దీపావళికి కూడా వరుస సెలవులు ప్రకటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే మరో నాలుగు రోజులపాటు సెలవులు రాబోతున్నట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన విద్యార్థులు ఒక్కసారిగా సంబరపడిపోతున్నారు.


దీపావళి పండక్కి నాలుగు రోజులు సెలవులని తెలియడంతో మురిసిపోతున్నారు. దీపావళి పండుగ అక్టోబర్ 31న జరుపుకోవాలని ఇంటిల్లిపాది జరుపుకునే వారు విద్యార్థులు కుటుంబ సభ్యులు కూడా తమ సొంత ఊర్లకు ప్రయాణం అవుతూ ఉన్నారు. దీంతో దీపావళి పండుగను మూడు రోజులపాటు కొన్ని ప్రాంతాలలో నిర్వహిస్తూ ఉంటారు. గురువారం దీపావళి పండుగ కావడం చేత ఆ మరుసటి రోజు పని దినం కావడం చేత దూర ప్రాంతాలకు వెళ్లిన వారు తిరిగి రావడం చాలా ఇబ్బందని తమిళనాడు ప్రభుత్వం గుర్తించి శుక్రవారం అంటే నవంబర్ ఒకటవ తారీఖున కూడా హాలిడేగా ప్రకటించారు.


ఇక ఆ తర్వాత శని ,ఆదివారాలలో సెలవులు ఉండడం చేత పండుగ మరింత ఉత్సాహంగా జరుపుకునేందుకు నాలుగు రోజులపాటు సెలవులు లభించనున్నాయి. దీంతో నాలుగు రోజులపాటు సెలవులు ఉంటాయని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించిందట.దీంతో ఈ విషయం విన్న రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమిళనాడు ప్రభుత్వం లాగే ఇక్కడ కూడా సెలవులు ప్రకటిస్తే విద్యార్థులు దీపావళి పండుగను సంబరంగా జరుపుకుంటారంటూ తెలియజేస్తున్నారు. మరి అక్టోబర్ 31న దీపావళి రోజు ఒక్కటే మాత్రం సెలవు దినంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా దీపావళి పండుగ సెలవులను ప్రకటిస్తారో చూడాలి మరి. ఇప్పటికే వరదల కారణంగా సెలవులు ఎక్కువగా ఇస్తూ ఉండడంతో చాలామంది సిలబస్ వెనుక పడుతోందని పిల్లల భవిష్యత్తు వెనుకబడుతుందనే విధంగా తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: