ప్రస్తుతం వినిపిస్తున్న వార్తలన్నీ కూడా అసత్య ప్రచారాలు అని ప్రజలు ఎవరూ కూడా ఇలాంటి విషయాలను నమ్మవద్దండి అంటూ తెలియజేశారు పెట్రోలియం శాఖామంత్రి.. యుద్దాల కారణంగా చమురు కొరత ఏర్పడిందని దీంతో క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతాయని మనదేశంలో కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పేరగబోతున్నాయని వార్తలు గత కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి.. ఇవన్నీ కూడా అసత్య ప్రచారాలే అంటూ తెలిపారు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్. మిడిల్ ఈస్ట్ లో అశాంతి కారణంగా చమురు కొరత ఎటువంటి విధంగా లేదని తెలిపారు.
కావలసిన దానికంటే కాస్త ఎక్కువగానే ఉంది అంటు క్లారిటీ ఇచ్చారు కేంద్రమంత్రి. బ్రెజిల్, గయానా వంటి దేశాల నుంచి కూడా ఆయిల్ సరఫరా పెరిగిపోయింది అని దీనివల్ల చమురు మార్కెట్లో మార్పులు రావచ్చు అంటూ తెలిపారు రష్యా, ఇరాన్ నుంచి ఇండియాకు ఎక్కువగా చమురు దిగుమతి జరుగుతుందని తెలియజేశారు. ఇవే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా చమురు దిగుమతి జరుగుతున్నదనీ తెలిపారు కేంద్రమంత్రి దీని ఫలితంగానే రాబోయే రోజుల్లో పెట్రోల్ డీజిల్ ధరలు కూడా తగ్గే అవకాశం ఉందని తెలిపారు. చమురు నిల్వలు కూడా చాలా అధికంగానే ఉన్నాయని తెలిపారు కేంద్రమంత్రి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర 73 డాలర్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి అందరూ అనుకుంటున్నారు గాని పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తారేమో చూడాలి.