జనాలు తాగి, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే శిక్షించే పోలీసులను మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. తప్ప తాగిన ఎస్సై ఒకరు పబ్లిక్‌లోనే బాలికకు లిప్ లాక్ పెట్టేసి విచక్షణారహితంగా బిహేవ్ చేసిన ఘటన పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో జరగగా తాజాగా దానికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చింది. అవును, అయితే ఆ ఎస్సై కూడా ఓ మహిళ కావడం ఇక్కడ కధలోని ట్విస్ట్. అవును, ఓ మహిళా ఎస్సై డ్యూటీ సమయంలో ప్రవర్తించిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మద్యం సేవించారా? అన్నందుకు నడిరోడ్డుపై ఓ మైనర్ బాలికకు లిప్ కిస్ పెట్టడంతో స్థానికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో సదరు ఏఎస్సైని స్పస్పెండ్ చేయడం కూడా జరిగిపోయింది.
వివరాల్లోకి వెళితే, సిరిగురిలోని వార్డు నంబర్ 46లో ఉన్న ఓ స్కూల్ గ్రౌండ్లో ఇద్దరు మైనర్లు కూర్చొని ఏవో కష్టసుఖాలు మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడే అటువైపుగా వెళ్తున్న పింక్ మొబైల్ పెట్రోలింగ్ పోలీస్ వ్యాస్ వారి వద్ద ఆగగా అందులోంచి ఓ మహిళా పోలీసు అధికారి అక్కడ దిగి వారిని విచక్షణారహితంగా కొట్టారు. దీంతో అక్కడి వారు పోలీసు చేష్టలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మైనర్లను ప్రశ్నించకుండా డైరెక్టుగా దుర్భాషలాడారని ఆరోపించారు.
ఈ క్రమంలో మైనర్ తల్లి తన కుమార్తె, ఆమె స్నేహితుడిపై అన్యాయంగా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేయడం వీడియోలో కనిపిస్తోంది. డ్యూటీలో ఉన్న మహిళా ఏఎస్సై మద్యం మత్తులో ఉండడం ఇక్కడ అసలు ట్విస్ట్. ఆమె మత్తులో ఉండి, వారిని తాగుబోతులు అని ఆరోపించింది. ఈ క్రమంలో వారు... "మీ దగ్గర మద్యం వాసన వస్తోంది మేడమ్.. దూరంగా ఉండండి!" అని సదరు బాలిక అనడంతో పోలీసు అధికారికి కోపం వచ్చింది. వంటనే, ఒట్టు నేను తాగలేదు.. కావాలంటే చూడూ! అంటూ బాలికకు నడిరోడ్డుపై లిప్ కిస్ ఇచ్చింది. దింతో ఈ ఘటన హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు మాట్లాడుతూ ఆమెపై శాఖా పరమైన విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.