హిందువులకు కొన్ని పండుగలు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు.. అలా దీపావళి పండుగకు కూడా లక్ష్మీదేవి వస్తుందని చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. దేశవ్యాప్తంగా జరుపుకునే ఈ పండుగ కొన్ని ప్రాంతాలలో ఐదు రోజుల పాటు జరుపుతూ ఉంటారు. అయితే ఇందులోనే ధన త్రయోదశి కూడా ఉంటుందట.. ఈ పండుగతో దీపాల పండుగ ప్రారంభమవుతుందట. దీపాల పండుగను ఐదు రోజులపాటు చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. అయితే ప్రతి ఏడాది కూడా అశ్వయుజ మాసంలో కృష్ణపక్షంలో త్రయోదశి రోజున ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. అయితే ఎవరైతే నిష్టతో నియమాలతో ధన్వంతరిని పూజిస్తారు ఆ ఇంటిల్లిపాది ఆనందంతో ఐశ్వర్యంతో ఉంటారట.


ధన త్రయోదశి రోజున ఉదయం లేవగానే తల స్నానం చేసి బంగారం, వెండి  వంటి వాటితో చేసిన లక్ష్మీదేవి గణేశుడు విగ్రహాలను కొత్తవి తీసుకువచ్చి పూజించాలి. ఆ ఇంటికి శుభప్రదంగా భావిస్తారు.


అలాగే ధన త్రయోదశి రోజున ఎవరైనా కొంతమందికి భోజనం పెట్టించడం వల్ల అంతా మంచి జరుగుతుంది. అలాగే దీపాలు ప్రతిరోజు సాయంత్రం వరకు వెలిగిస్తూ ఉండాలి. ధన త్రయోదశి రోజున కొత్త చీపురు ధనియాలు వంటివి కొనడం శుభప్రదంగా భావిస్తూ ఉంటారు.


చేయకూడని పనులు ఏమంటే.. ఇల్లును శుభ్రం చేసుకోకపోవడం, లక్ష్మీదేవి ఫోటో ఉన్న పూజించకపోవడం.. పూజ చేసేటప్పుడు దృష్టి పూజ మీద కాకుండా చెడు ఆలోచనల వైపు పెట్టడం.. మహిళలను అవమానించడం, ఆశుభమైన వస్తువులను కొనకూడదు కేంద్ర గాజు పాత్రలని అసలు కొనకూడదట. ఎవరైనా ఆలోచన మాంసం కానీ మద్యం కానీ తాగితే చాలా ఇబ్బందులు ఎదురవుతాయట.

ధన త్రయోదశి రోజున.. ఏదైనా లక్ష్మి, విగ్నేశ్వరుడి బొమ్మలను ఇంటికి తీసుకురావడం వల్ల ఆ ఇంటిల్లిపాది లక్ష్మీదేవి కళకళలాడుతూ ఉంటుందట. లేకపోతే ధనియాలు తీసుకురావడం వల్ల కూడా మంచి కలుగుతుందట. ఇలా ఈ వస్తువులలో ఏదో ఒకటి తెచ్చుకున్న ఆ ఇంటిలిపాది లక్ష్మీదేవి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని పండితులు తెలుపుతున్నారు. అలాగే ఆ ఇంటికి డబ్బు కొరత కూడా ఉండదట.

మరింత సమాచారం తెలుసుకోండి: