దీపావళి పండుగ వస్తోందంటే చాలు ఎక్కడో ఒకచోట బాణాసంచా పేలిన సంఘటనలు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు తాజాగా కేరళలోని కసర్గౌడ్ అనే ప్రాంతంలో ఒక్కసారిగా ప్రజలను ఉలిక్కిపాటికి గురయ్యేలా చేసింది. నీలేశ్వరంలోని విరార్ కాపు ఆలయంలో నిన్నటి రోజున అర్ధరాత్రి సమయంలో బాణసంచా పేలిన సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఆలయానికి చాలామంది భక్తులు తరలిరావడంతో బాణసంచా కాల్చడం మొదలుపెట్టిన సమయంలోనే బాణసంచా వెళ్లి పెద్ద మొత్తంలో ఉండే బాణసంచా గదులలోకి వెళ్లి ఒక అగ్గి అక్కడ పడడంతో పేలిన సంఘటనలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.


చివరికి ఆ మంటలు చెలరేగిపోవడంతో ఫలితంగా అక్కడ ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ఈ పేలుడు అనంతరం ప్రాణాలు కాపాడుకునేందుకు చాలా మంది భక్తులు అక్కడి నుంచి పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగినట్లుగా సమాచారం దీంతో 150 మందికి పైగా గాయాలు కావడం జరిగిందట. అలాగే ఇందులో 8 మంది పరిస్థితి విషయంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన పైన పోలీసులకు వెంటనే సమాచారం అందడంతో హుటాహుటిగా ఆ సంఘటన స్థలానికి వెళ్లారు.


క్షతగాత్రులను దగ్గరలో ఉండి ఆసుపత్రికి కూడా తరలించారు. తీవ్రంగా చాలా గాయాల పాలైన వారిని మంగళూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.. జిల్లా కలెక్టర్ ఇంపశేఖర్, అలాగే జిల్లా పోలీస్ చీఫ్ డి శిల్ప మాట్లాడుతూ .. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నామంటూ తెలియజేశారు ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చూసుకోవాలని ప్రజలకు, అక్కడున్న వ్యవస్థకు సైతం సూచనలు ఇచ్చారు. అందుకు సంబంధించిన పేలుడు దృశ్యాలు సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడం చేత చాలామంది ఈ వీడియో చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇక హైదరాబాదులో కూడా బొగ్గులకుంటలో ఆదివారం రోజున భారీ ప్రమాదం జరిగింది. దీంతో ప్రజలు కూడా అక్కడి నుంచి భయభ్రాంతులకు గురవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: