ఆచార్య చానిక్యుడు చాలా జ్ఞానవంతుడని చెబుతూ ఉంటారు.. ఈయన చంద్రగుప్తుని ఆస్థానంలో ప్రధానమంత్రిగా కూడా పనిచేసేవారు. అందుకే చాణక్య నీతి శాస్త్రం అనేది చాలా గొప్పదని చాలామంది తెలియజేస్తూ ఉంటారు. వీటిని పాటిస్తే జీవితంలో విజయం అనేది సాధించవచ్చు అని చాలామంది నమ్ముతూ ఉంటారు. చాణిక్య నీతి పెళ్లి దంపతుల బంధం గురించి ఒక విషయాన్ని ప్రస్తావిస్తూ.. వివాహమైన తర్వాత వివాహేతర బంధాలకు గల కారణాలను ఆయన వివరించడం జరిగింది. ముఖ్యంగా భర్త వేరే స్త్రీ మోజులో పడి భార్యకు దూరం కావడానికి గల కారణాలు ఏంటి అనే విషయాన్ని చానిక్యుడు చాలా క్లియర్ గా వివరించారు.



వివాహ బంధంలో శారీరక సమృద్ధి చాలా కీలకమని తెలియజేశారు.. ఇది మానసికంగా చాలా ఆనందాన్ని కలిగి ఉన్నప్పటికీ.. శారీరకంగా ఏదైనా ఇబ్బందులు ఉంటే కచ్చితంగా ఆ వివాహ బంధంలో ఇబ్బందులు తప్పవని చాణిక్యుడు తెలియజేశారు.


అలాగే వివాహ బంధంలో దంపతులు ఒకరినొకరు అర్థం చేసుకోవాలని.. శారీరక కలయిక కూడా చాలా ముఖ్యమని ఇది లేకపోతే దంపతులు మధ్య విభేదాలు మొదలవుతాయని తెలిపారు. దీనివల్లనే పురుషులు ఇతర స్త్రీలకు సైతం చాలా ఆకర్షితులు అవుతారని తెలియజేస్తున్నారు.


మరి కొంతమందికి తక్కువ ఏజ్లోనే వివాహమవుతూ ఉంటుంది ఈ వయసులో పెళ్లి చేసుకోవడం కూడా చాలా తప్పు..ఈ వయసు వారికి ఎక్కువగా కోరికల మీదే దృష్టి ఉంటుంది అందుకే ఇతర స్త్రీల వైపు చాలా ఆకర్షిస్తూ ఉంటారని చాణక్యులు తెలిపారు.


భార్య భర్తల మధ్య ప్రేమ నమ్మకం అనేది ఉండాలి అనుమానం ఉండకూడదు. ఇది కూడా వివాహేతర సంబంధాలకు దారితీస్తుందట.


భార్య భర్తలు ఇద్దరు కూడా తల్లిదండ్రులు అయ్యేవరకు వారి మధ్య కాస్త ప్రేమ ఎక్కువగా ఉంటుంది.అయితే పిల్లలు పుట్టిన తర్వాత వీరి యొక్క అభిరుచులు మారుతుంది అని.. భార్య కూడా ఎక్కువగా పిల్లలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటుందని తెలిపారు ఇది ఇతర స్త్రీల వైపు ఆకర్షించడానికి ముఖ్య కారణమట.


కోపం సమయంలో దంపతులు ఎవరో ఒకరు సర్దుకొని పోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండాలని కానీ ఎదిరిస్తే మాత్రం చాలా ఇబ్బందులకు గురై ఈ సమయంలోనే వివాహేత్తర సంబంధమైన వైపుగా అడుగులు వేస్తారని చాణిక్యనీతులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: