అశ్విన్ ఉన్ని అనే కంటెంట్ క్రియేటర్ ఇటీవల తన తల్లితో కలిసి ఓ వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారి లక్షల వ్యూస్ సొంతం చేసుకుంది. అశ్విన్ ఉన్ని తన రూమ్‌లో కూర్చొని తల్లిని తన వద్దకు రమ్మని పిలుస్తాడు. ఆమె వచ్చిన తర్వాత వీడియో ముందున్న కుర్చీని తల్లికి ఇచ్చి తాను ఆమె వెనకాల నిల్చుంటాడు. అప్పుడు ఆమెకు ఓ విషయం చెబుతాడు. తనకు ఓ సినిమా ఆఫర్ వచ్చిందని అశ్విన్ తల్లికి చెబుతాడు. దీంతో ఆమె పట్టలేనంత సంతోషానికి గురవుతుంది. అనంతరం ఆమె నిజం చెప్పమని కోరుతుంది. దీంతో అతను నిజంగానే ఆఫర్ వచ్చిందని, రూ.3లక్షలు ఇస్తామని చెప్పారని తల్లికి చెబుతాడు.
దీంతో ఆమె సంతోషానికి అవధులు లేకుండా పోతాయి. అయితే తనకు వచ్చింది సినిమా ఛాన్స్ కాదని, నీలి చిత్రాల్లో అవకాశమని చెబుతాడు. దీంతో అశ్విన్ తల్లి ఆశ్చర్యానికి గురవుతుంది. ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ నెటిజన్లను కట్టిపడేస్తోంది. అతడిపై ఒక్కసారి చిరాకు పడిన ఆమె "తల్లిదండ్రులతో ఎవరైనా ఇలాంటి విషయాలు చెప్తారా" అంటూ ప్రశ్నిస్తుంది. దీనికి యువకుడు తాను నటించడం లేదని, తనకు వచ్చిన ఆఫర్ గురించి మాత్రమే చెప్తున్నానని అంటాడు. అయినప్పటికీ ఆమె సరదాగా చిరాకు పడుతూ అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. అనంతరం తనకు వచ్చిన ఆఫర్ గురించిన మెసేజ్‌ను యువకుడు వీడియో చివర జత చేశాడు. దీంతో వీడియో పూర్తవుతుంది. ఈ వీడియోను అశ్విన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశాడు. అయితే, ఆమె అసలు ఆఫర్ గురించి తెలియగానే అది షాక్ రియాక్షన్‌గా మారింది.ఇది కాస్త వైరల్‌గా మారి నెట్టింట చక్కర్లు కొడుతోంది.