కొందరు సరదా కోసం సాహసాలు చేస్తూ ఉంటారు. ఇంకొందరు కిక్కు కోసం ప్రమాదకరమైన స్టంట్స్ చేయడానికి కూడా సిద్ధమవుతూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో మాత్రం ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకోవడం కోసం ఇలాంటి ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం. ఏకంగా ఎంతో మంది ప్రమాదం అని తెలిసినప్పటికీ ఏదైనా తేడా కొడితే ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతాయి అన్న విషయం ముందే గ్రహించినప్పటికీ కూడా.. సోషల్ మీడియాలో ఫాలోవర్లను సంపాదించుకోవాలని మాయతో కళ్ళు మూసుకుపోయి చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకుంటూ ఉంటారు.


 ఇలా ఈ మధ్యకాలంలో ఏకంగా ప్రమాదం అంచున నిలబడి ఎన్నో సాహసాలు చేసి గాయపడుతున్న వారు కొంతమంది అయితే.. ప్రాణాలు కోల్పోతున్న వారు ఇంకొంతమంది. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే అని చెప్పాలి. ఈ మధ్యకాలంలో ఏకంగా స్టంట్స్ చేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సర్వసాధారణంగా మారిపోయింది. ఇక్కడ ఒక యువకుడు కూడా ఇలాంటి స్టంట్ చేయాలని అనుకున్నాడు. కానీ అది కాస్త బెడిసి కొట్టి అతనికి ఒక చేదు అనుభవాన్ని మిగిల్చింది.


 ఏకంగా ఒక కొండ అంచును నిలబడి బ్యాక్ ఫ్లిప్ చేయాలని అనుకున్నాడు ఆ యువకుడు. అనుకున్నట్లుగానే బ్యాక్ ఫ్లిప్ చేశాడు. కానీ ఆ తర్వాత బ్యాలెన్స్ కోల్పోయి ఏకంగా కొండ కిందికి పడిపోయాడు. అయితే ఆ వ్యక్తి బ్రతికున్నాడా లేదంటే తీవ్రంగా గాయపడి చనిపోయాడా అనే విషయం మాత్రం తెలియలేదు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోవడంతో ఇది చూసి అభిమానులు అందరూ కూడా షాక్ లో మునిగిపోతున్నారు అని చెప్పాలి. కుదురుగా ఉండకుండా ఇలాంటివి అవసరమా బ్రో అంటూ ఈ వీడియో చూసిన తర్వాత అందరూ కామెంట్ చేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: