- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

టాలీవుడ్ లోనే కాదు ఏ భాషలో సినిమా రంగంలో అయినా తప్పించుకోలేని ఆకర్షణలు రెండు ఉంటాయి. ఒకటి డబ్బు ... రెండవది అమ్మాయి. ఎంతవారు గాని వేదాంతలైన గాని వారు చూపు చూడగానే కరిగిపోదులే అన్నారు వెనకటికి ఒకరు. ఇక టాలీవుడ్ లో కూడా రిలేషన్లు మామూలుగా ఉండవు. ఇది అందరికీ తెలిసిందే. రిలేషన్ లో రకరకాలు ఉంటాయి. జస్ట్ కొద్దిరోజులు ఎంజాయ్ చేసి తప్పుకోవచ్చు .. లేదా కలిసి ఉండవచ్చు. హీరోలు .. హీరోయిన్లు రిలేషన్లు మాత్రమే కాదు దర్శకులు ... హీరోయిన్ల రిలేష‌న్లు కూడా ఇటీవల కామన్ అయిపోయాయి. ఈ ఏడాది ఓ డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడు ఒకరు ఉన్నారు. భార్య విదేశాలలో ఉంది. ఇక్కడ ఏం చేయాలి ? అందుకే ఓ హీరోయిన్ తో సహజీవనం సెట్ చేసుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.


హీరోయిన్ కుడా తెలుగులో పెద్దగా అవకాశాలు లేవు. తొలి సినిమా హిట్ .. అటు గ్లామర్ కంటెంట్ కు తక్కువ .. ఇటు క్లాసు సినిమాలు తక్కువ అవకాశాలు ఎలా వస్తాయి. అప్పటికప్పుడు గ్లామర్ ఒల‌క బోస్తూ ఫోటోలు వదులుతున్నా పట్టించుకున్న వారు ఎవరూ లేరు. ఈ టైంలో ఈ దర్శకుడికి ఆ హీరోయిన్ కు ఎక్కడో కనెక్ట్ అయింది. ఇద్దరు కలిపి హైదరాబాదులో చాలా సీక్రెట్ గా గదిలో సహజీవనం మొదలు పెట్టేశారు. వెంటనే ఈ సహజీవనం పుణ్యమా అని ఆ దర్శకుడు ఓ చిన్న సినిమాలో చిన్న పాత్ర ఇప్పించారు.


ఈ ఏడాది ఏదో అలా 3 - 4 సినిమాలతో గడిచిపోయింది. వచ్చే ఏడాది సినిమాలు ఉంటాయా లేదా సహజీవనంతో సరిపోతుందో చూడాలి. సదరు దర్శకుడు చేస్తున్న తాజా సినిమాలో కూడా ఆ హీరోయిన్ కు మళ్ళీ ఓ పాత్ర దొరికింది అని టాక్. ఏదో ఏమైనా మొత్తానికి సహజీవనం పుణ్యమా అని ఆ దర్శకుడికి ఎంజాయ్మెంట్ దొరుకుతుంటే ఆ హీరోయిన్ కు చిన్న అవకాశాలు అయితే వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: