సింహం వేషం వేసుకున్న ఆ వ్యక్తిని చూసి, అసలు సింహాలు అతన్ని తమలో ఒకరిగా భావించాయి. కొత్త వస్తువును చూసిన పిల్లలా ఆ వ్యక్తి దగ్గరకు వచ్చాయి. అంతేకాదు, ఆడుకోవడానికి ప్రయత్నిస్తూ అతనిని కాళ్ళతో తాకడం మొదలుపెట్టాయి. కానీ, సింహాల ఆట అతనికి భయం కలిగించింది. భయంతో అతను అక్కడి నుంచి పరుగు తీశాడు. కానీ, సింహాలు అతన్ని వెంటనే వదిలేలా లేవు. అతన్ని వెంబడించడం మొదలుపెట్టాయి.తప్పించుకోవడానికి ఆ వ్యక్తి ఒక చెట్టు ఎక్కాడు. కానీ, సింహాలు అక్కడి నుంచి కూడా వెళ్ళిపోలేదు. చెట్టు కిందే నిలబడి ఆ వ్యక్తిని చూస్తూ ఆడుకోవడం మొదలుపెట్టాయి. ఈ వీడియోలో సింహాలు చాలా సేపు అలాగే నిలబడి ఆ వ్యక్తితో ఆడుకుంటున్న దృశ్యం కనిపిస్తుంది.
సింహాలతో ఆడుకుంటున్న ఆ వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను లక్షకు పైగా మంది లైక్ చేశారు. కోట్ల కొద్దీ మంది చూశారు. ఈ వీడియో చూసిన వాళ్ళంతా నవ్వుకుంటున్నారు. కొంతమంది ఆ వ్యక్తి సింహాలను మోసం చేశాడని అనుకుంటున్నారు. మరికొందరు ఆయన ఆ సింహాలకు సంరక్షకుడు కాబట్టి ఇంత దగ్గరగా ఉన్నారని అనుకుంటున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా చర్చకు దారితీసింది.