ఈ రోజుల్లో సినిమాకి వెళ్లాలంటే కనీసం వెయ్యి రూపాయలు చేతిలో పట్టుకొని పోవాల్సి వస్తోంది. ఇక మూవీ ఇంటర్వెల్ సమయంలో స్నాక్స్ తింటే వందల్లో ఖర్చు వస్తోంది. ఆ ఖర్చు భరించలేక చాలామంది ఇంటర్వెల్‌లో ఏం తినకుండానే ఖాళీగా కూర్చుంటున్నారు. బయటనుంచి థియేటర్లోకి ఆహార పదార్థాలు తీసుకెళ్లనివ్వరు. తింటే అక్కడ కొనుగోలు చేసిన ఆహార పదార్థాలే తినాలి. లేదంటే అసలు తినకుండా ఉండాలి. ఈ రూల్ వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ రూల్ ని బ్రేక్ చేసి కొంతమంది యువతులు ఒక పెద్ద స్కామ్‌ చేశారు. వారి తెలివికి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

వీరికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో క్లిప్‌లో ఒక యువతి థియేటర్‌లో నైక్‌ షూ బాక్స్‌ నిండా పాప్ కార్న్, కోక్‌ బాటిల్ పెట్టి, దానిని పట్టుకొని సినిమా థియేటర్‌లోకి వెళ్లి ఇంటర్వెల్లో వాటిని తినడం చూడవచ్చు. ఈ యువతి మల్లీఫ్లెక్స్ థియేటర్‌లో సినిమా చూడాలనుంది. అయితే ఇంటర్వెల్ సమయంలో మాత్రం ఖర్చులు తగ్గించుకోవాలని భావించింది. ఒక ప్లాన్ వేసి దానిని చక్కగా అమలుపరిచింది. ఎవరికీ అనుమానం రాకుండా ఆమె ఈ పని చేసింది. వంటింట్లో వేడివేడి పాప్‌కార్న్ యాడ్ చేసుకోవడం వల్ల ఆమెకు చాలా తక్కువ ఖర్చు వచ్చిందని చెప్పుకోవచ్చు ఆమెతో పాటు ఫ్రెండ్స్ కూడా ఈ పాప్‌కార్న్ తింటూ ఎంజాయ్ చేశారు. ఆ విధంగా వీళ్ళు ఒక చిన్నపాటి స్కామ్ చేశారు. స్కామ్ 1992 బ్యాక్ గ్రౌండ్ సాంగ్ వేసి మరీ తమ స్కామ్ చేసినట్లు ఒక వీడియో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు.

ఐడియా చూసి చాలా మంది ఫిదా అవుతున్నారు. ఈ యువతులు చాలా చక్కగా నవ్వుతున్నారని మరి కొంతమంది కామెంట్లు చేశారు. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయంటూ ఈ వీడియో చూసిన చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఈ ఐడియా వీళ్ళకి రాకపోయి ఉంటే దాదాపు 600 నష్టపోయి ఉండేవారు అని అన్నారు 30 రూపాయలు పాప్ కార్న్ 600 రూపాయలు తీసుకుంటున్న సినిమా స్టోర్స్ ఉన్నాయని మరి కొంతమంది అన్నారు. కోట్ల వ్యూస్‌తో తెగ వైరల్ అవుతున్న ఈ వీడియోను దీన్ని మీరు కూడా చూసేయండి.



https://www.instagram.com/reel/DBja5JjBXo9/?utm_source=ig_web_copy_link

మరింత సమాచారం తెలుసుకోండి: