ఈ దారుణమైన ఘటన చైనాలోని జుహై నగరంలో జరిగినట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే... చైనాలోని జుహై నగరంలో ఉన్న క్రీడా ప్రాంగణానికి ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రజలు క్రమం తప్పకుండా వెళ్లి వ్యాయామం చేస్తుంటారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న 62 ఏళ్లు వృద్ధుడు తన కారుతో వ్యాయామం చేస్తున్న వారిని ఢీకొట్టి చంపేశాడు. ఈ ప్రమాదంలో ఇప్పటిదాకా 35 మంది చనిపోయినట్టు సమాచారం. ఈ క్రమంలో అనేకమంది తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇప్పటివరకు అలా 43 మంది గాయాలపాలైనట్టు సమాచారం. కాగా ఈ ఘటనకు కారణమైన ఆ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అతని మాజీ భార్యకు విడాకులు ఇచ్చినప్పటికీ ఆస్తిలో వాటా ఇవ్వాలని స్థానికంగా ఉన్న కోర్టు కూడా ఆమెకి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ఆమె వత్తిడి ఎక్కువైంది. అయితే ఆ ఆస్తి ఇవ్వడం అతనికి అస్సలు ఇష్టం లేదు. దీంతో అతడు తన మానసిక ఆరోగ్యాన్ని కోల్పోయినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఉన్మాది లాగా మారిపోయాడు. ఫలితంగా 35 మంది మరణానికి, 43 మంది గాయాలపాలవ్వడానికి కారకుడు అయ్యాడు. ఈ ఘటన పై ప్రస్తుతం అక్కడి పోలీసులు విచారణ చేస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి వీడియో సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.