పెద్ద పెద్ద పుస్తకాలను సైతం సెకండ్ల వ్యవధిలోనే స్కానింగ్ చేసి చదివేస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఆ బుక్ లో ఏ పేజీలో ఉన్న మేటర్ అడిగిన కూడా ఇట్టే చెప్పేస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇలా రోబో సినిమా చూసినప్పుడు రియల్ లైఫ్ లో మనుషులు ఇలా ఉండడం అసాధ్యం అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు శంకర్ రోబో కంటే టాలెంటెడ్ మనిషికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది. కేవలం 30 సెకండ్ల లోనే బుక్ మొత్తాన్ని కూడా చదివేశాడు ఇక్కడ ఒక వ్యక్తి.
అయితే ఈ వ్యక్తి యొక్క టాలెంట్ గురించి తెలిసి ఇది నిజంగా నిజమేనా అని చర్చించుకుంటున్నారు ఇంటర్నెట్ జనాలు. ఏకంగా 30 పేజీల పుస్తకాన్ని చదవడం అంటే కనీసం అరగంట అయినా పడుతుంది. అరగంట వరకు చదివిన అందులో ఉన్నది గుర్తుంచుకోవడం కూడా కష్టమే. కానీ కొరియాకు చెందిన ఒక యువకుడు సెకండ్లలో పుస్తకాన్ని చదివేశాడు. సాంగ్ జూన్ అనే యువకుడు 35 సెకండ్లలో పుస్తకం చదవడం పూర్తి చేశాడు. అంతేకాదు ఇక ఆ పుస్తకంలో ఉన్న మ్యాటర్ కు సంబంధించి ఏ ప్రశ్న అడిగినా కూడా సమాధానం చెప్పేస్తూ తోటి మిత్రులను సైతం అవాక్కయ్యేలా చేశాడు. మరి ఇంకెందుకు ఆలస్యం ఇతని టాలెంట్ ని మీరు కూడా చూసేయండి.