ఎంతటి బలవంతుడైన సరే కొన్ని కొన్ని సార్లు తెలివితో ఆలోచించాల్సి ఉంటుంది. లేదంటే ఏదో చేయడానికి వెళ్తే ఇంకేదో జరిగి బొక్క బోర్లా పడే దుస్థితి వస్తుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో చాలానే జరుగుతున్నాయి. ఇక ఆ వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. ఇక్కడ ఒక సింహం ఓవర్ కాన్ఫిడెన్స్ తో చేసిన పని కాస్త ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోయింది. సాధారణంగా సింహం అడవికి రారాజు. సింహాన్ని చూస్తే ఏ జంతువైనా సరే వనికి పోవాల్సిందే దూరంలో సింహం కనిపించిందంటే చాలు రూట్ మార్చుకొని మరో దారిలో వెళ్లాల్సిందే. అంతలా సింహాలు అడవి పై పెత్తనం చెలాయిస్తూ ఉంటాయి.


 ఇలా జంతువులను వేటాడి కడుపు నింపుకునే సింహాలను కూడా భయపెట్టే.. జంతువులు కొన్ని ఉంటాయి. అలాంటి బలమైన జంతువులను వేటాడే ముందు అడవికి రారాజు అయిన సింహాలు కూడా కాస్త తెలివిగా ఆలోచించాలి అని చెప్పాలి. ఇలా సింహాలను సైతం భయపెట్టే జంతువులలో అటు ఖడ్గ మృగాలు కూడా ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఖడ్గం మృగాలు ఎదురుపడినప్పుడు సింహాలు భయంతో దూరం జరుగుతూ ఉంటాయి. వాటిని వేటాడేందుకు పెద్దగా సాహసం కూడా చేయవు. కానీ ఇక్కడ ఒక సింహం మాత్రం ఏకంగా ఓవర్ కాన్ఫిడెన్స్ తో భారీ ఖడ్గ మృగం పైనే   దాడి చేయాలని ప్రయత్నించింది. చివరికి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.


 ఇందుకు సంబంధించిన వీడియో కాస్త వైరల్ గా మారిపోయింది. ఆఫ్రికాలో మూడు సింహాలు ఏకంగా ఖడ్గ మృగాన్ని వేటాడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాయి. వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటే.. ఒక అడవిలో ఒక మగ సింహం రెండూ ఆడ సింహాలు రెస్ట్ తీసుకుంటున్నాయి. ఇంతలోనే ఒక భారీ ఆకారం ఉన్న కడ్గ మృగం అక్కడికి వచ్చింది. దాన్ని చూడగానే ఆడ సింహాలు కాస్తంత దూరంగా బెదిరిపోయాయ్. కానీ మగ సింహం మాత్రం లెక్క చేయలేదు. కూర్చున్న చోట కదలకుండా ఖడ్గ మృగాన్ని అలాగే గమనించింది. ఇక ఖడ్గ మృగం కూడా రిస్క్ ఎందుకు అనుకొని వెనకడుగు వేసి దాని దారిన అది వెళ్ళిపోతుంది. ఇలాంటి సమయంలో సింహాలు ఓవర్ కాన్ఫిడెన్స్ కు పోయాయి. ఖడ్గ మృగాన్ని వేటాడేందుకు సిద్ధమయ్యాయి. దీంతో ఖడ్గమృగం ప్రతిదాటికి దిగేందుకు ప్రయత్నం చేసేసరికి రెండు ఆడ సింహాలు కాస్త వెనకడుగు వేసాయ్. మగ సింహం మాత్రం ఇగోకు పోయి.. దాడికి ముందుకు పోయింది. దీంతో ఖడ్గమృగం దాడి చేసేందుకు రెడీ అవ్వగా.. అతి సమీపంలో రెప్ప పాటుకాలంలో  తప్పించుకోగలిగింది. లేదంటే కొద్దిలో ఆ సింహం ప్రాణాలు పోయేవి.

మరింత సమాచారం తెలుసుకోండి: