ఈ రోజుల్లో మహిళలకు ఎక్కడా భద్రత లేకుండా పోయింది. ఎక్కడ చిన్న సందు దొరికినా సరే కామాంధులు వారిని లైంగికంగా హింసిస్తున్నారు. పబ్లిక్ ప్రదేశాల్లో కూడా మహిళలకు సేఫ్టీ లేకుండా పోయింది ఇక జిమ్‌లలో కూడా ఆడవారిపై ట్రైనర్లు కన్ను వేస్తున్నారు. తాజాగా ఢిల్లీలోని కృష్ణనగర్‌లోని ఓ జిమ్‌లో మహిళలపై ఎలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయో తెలిసి వచ్చింది. బిలాల్ అహ్మద్ ఖాన్ అనే ఒక జిమ్ ట్రైనర్ తన దగ్గరకు వచ్చిన మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. అతను ఒక మహిళను అసభ్యంగా తాకిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రాంతంలో అతను రన్ చేస్తున్న రెండో జిమ్ ఇది.
ఈ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారగా దీన్ని చూసి చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోలో కోచ్ సదరు మహిళతో వర్కౌట్స్ చేయిస్తున్నాడు. ఆమెకు ట్రైనింగ్ ఇస్తున్న నెపంతో అతను ఎక్కడో తాకుతున్నాడు. వీడియోలో కనిపించినట్లుగా అతను ఆ మహిళ వెనుక భాగాన్ని, రొమ్ములను, ఇంకా పరాయి మగవాడు టచ్ చేయకూడని చోట ఆమెను టచ్ చేస్తున్నాడు. ఈ ట్రైనర్ తీరును నెటిజన్లు ఖండిస్తున్నారు. ఒక మహిళను అతడు అంత ధైర్యంగా ఎలా టచ్ చేస్తున్నాడు? అని ఆశ్చర్యపోతున్నారు. అతని జిమ్ లో ఇతర మహిళలు కూడా ఉన్నారు. వారు కూడా జిమ్ ట్రైనర్ చేస్తున్న పనిని చూసి చూడనట్లుగానే ప్రవర్తిస్తున్నారు.
బాధిత మహిళ అతను అలా పట్టుకుంటూ ఉంటే ప్రతిఘటించడం లేదు. ఆమెను భయపెట్టి అలా తన ఆధీనంలోకి అతను తెచ్చుకున్నాడా? అనేది తెలియ రాలేదు ఈ వీడియో వైరల్ అయిన తర్వాత చాలామంది నెటిజన్లు ఇతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఇలాంటి కామాంధులు వ్యాయామశాలలో కూడా ఉంటున్నారు కాబట్టి అక్కడ మహిళలకు భద్రత ఉంటుందా అనే కోణంలో ఇప్పుడు ఆందోళనలు మొదలయ్యాయి. ఈ మొదట ఎక్స్ ప్లాట్ ఫామ్ లో వైరల్ గా మారింది. తర్వాత అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో చక్కర్లు కొడుతోంది. దీనిని మీరు కూడా ఇక్కడ చూడొచ్చు.