అంతేకాకుండా తాను తాజ్ మహల్ ప్యాలెస్ లో టీ తాగిన అనుభవాన్ని సైతం తెలియజేస్తూ ఒక వీడియోని షేర్ చేయగా అది వైరల్ గా మారుతున్నది.. ఈ వీడియోను ఇప్పటికే సుమారుగా రెండు కోట్లకు మందిపైగా చూశారు.. ఈ వీడియో విషయానికి వస్తే.. తాజ్ మహల్ ప్యాలెస్ కు వెళ్లే దారిలో తాను ఎంట్రీ ఇచ్చేటప్పుడు చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. హోటల్ భాగం చాలా అద్భుతంగా ఉందని అక్కడ చాలామంది ప్రముఖ వ్యక్తుల ఫోటోలను కూడా గోడల మీద చూపించడం జరిగింది.
తాజ్ లోపల తాను ఒక రాజభవనంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది అంటూ తెలియజేశారు. అయితే ఇందులో ఒక టీ ఆర్డర్ చేయగా దీని ధర రూ.1800 రూపాయలు అలాగే పన్నుతో కలుపుకొని రూ.2124 రూపాయలు అయ్యిందని తెలిపారు. అయితే ఇక్కడ భారతీయ టీతోపాటుగా వడపావ్, అలాగే గ్రిల్డ్ సాండ్విచ్లు, సిల్వర్ పేపర్ పైన బట్టర్ వంటి స్నాక్స్, కారి ఫఫ్, కాజు కట్లు వంటివి ఇస్తారని తన అనుభవాన్ని తెలియజేశారు ఈ వీడియోలో. అయితే ఈ తాజ్ లోపల ఉండే టీకి 10కి 5% రేటింగ్ ఇచ్చారు. తన జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి అనుభవాన్ని పొందినందుకు చాలా ఆనందపడుతూ వీడియో ని షేర్ చేశారు పటాన్. అయితే ఇది చూసిన చాలామంది ఇది తమ నెలవారి ఆహారం ఖర్చు అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.