ప్రముఖ హాస్యనటుడు మౌరీజియో కాటేలాన్ దీనిని రూపొందించడం జరిగింది. అరటిపండు కుళ్ళిపోతే ఎలా మార్చుకోవాలో ఆయన చెప్పారు. ఈ అరటి పండుకు సంబంధించిన పూర్తి వివరాలలోకి వెళ్లినట్లయితే.... గోడకు అంటించి ఉన్న చిన్న అరటి పండుకు వేలాన్ని వేయగా ఓ వ్యక్తి దాదాపు రూ. 52 కోట్లకు ఈ అరటిపండును కొనుగోలు చేసుకున్నాడు. ఇలా రూ. 52 కోట్లకు అరటి పండు అమ్ముడు పోవడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తోంది.
న్యూయార్క్ లో ఇటీవలే జరిగిన ఆర్ట్ వేలంలో భాగంగా ఓ మిలియనిర్ ఈ అరటిపండు ఆర్ట్ కొనుగోలు చేశాడు. ఈ బనానా టేప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫ్రెండ్ అవుతోంది. ఇది రూ. 52 కోట్లకు పలకడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీనిని ప్రముఖ ఇటాలియన్ ఆర్టిస్ట్ మౌరిజియో కాటెలాన్ సృష్టించగా... ఓ సంస్థ ఈ వేళాన్ని నిర్వహించింది.
దీనిని ఇటాలియన్ ఆర్టిస్ట్ మొదట 2019 సంవత్సరంలో ఆర్ట్ వర్క్ ను ప్రదర్శించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆర్ట్ లో ఉండే బనానాను ప్రతి మూడు రోజులకు ఒకసారి మార్చాల్సి ఉంటుంది. 2019లో జరిగిన వేలంలో భాగంగా ఈ బనానా ఆర్ట్ ని ఎవరు ఊహించని విధంగా విక్రయించారు. ఐదేళ్ల తర్వాత మళ్లీ ఈ ఆర్ట్ పై వేలన్ని నిర్వహించడంతో దాదాపు రూ. 98 లక్షలకు విక్రయమైంది. మొత్తానికి ఈ అరటి పండు గోళ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.