నేటి రోజుల్లో ఉరుకుల పరుగుల జీవితంలోనే ప్రతి మనిషి కూడా బ్రతికేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే ఏ పని చేయాలన్నా కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా చేయాలని ఆత్రుతతో ఉంటున్నాడు. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు తెలిసి తెలియక మనిషి చేస్తున్న చిన్న చిన్న పొరపాట్లు ఏకంగా ప్రాణాలు మీదికి తేస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా వాహనం నడిపే విషయంలో కొంతమంది వాహనదారులు చేసే చిన్నపాటి నిర్లక్ష్యాలు ఎంతోమంది ప్రాణాల మీదికి తెస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. సాధారణంగా రోడ్డుపై వెళ్తున్న సమయంలో ఎన్నో భారీ ట్రక్కులు కూడా కనిపిస్తూ ఉంటాయి.


 అయితే ఇలాంటి భారీ ట్రక్కుల పక్కన వాహనం నడిపేటప్పుడు ఎంతో జాగ్రత్త వహించాలని ట్రాఫిక్ పోలీసులు చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఆ ట్రక్కులు ఆగినప్పుడు వాటి పక్కనే బైక్ లాంటి వాహనాలు ఆగితే ప్రమాదాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది అని హెచ్చరిస్తూ ఉంటారు. ఎందుకంటే ట్రక్ డ్రైవర్లకు నో వ్యూ జోన్లు కొన్ని ఉంటాయి. అయితే బైక్ లాంటి చిన్న వాహనాలను ట్రక్కుల పక్కన వచ్చి ఆపినప్పుడు ఇక్కడ ట్రక్ డ్రైవర్లకు ఈ చిన్న వాహనాలు అస్సలు కనిపించవు. దీంతో పక్కన ఏ వాహనం లేదు. అనుకొని వాళ్ళు ముందు ట్రక్కును పోనిస్తే.. ఇక ఆ ట్రక్కు కిందపడి బైక్ పై ప్రయాణిస్తున్న వారు ప్రమాదానికి గురి కావడం జరుగుతూ ఉంటుంది.


 అయితే ఇలా ట్రాఫిక్ సిగ్నల్స్ పడినప్పుడు భారీ ట్రక్కుల పక్కన వెళ్లి బైక్ను ఆపడం వల్ల ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి అన్నదానికి నిదర్శనంగా ఇక ఇప్పుడు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే ఇక్కడ ప్రమాదం జరగలేదు. కానీ ట్రక్కు నడుపుతున్న డ్రైవర్ బైక్ నడిపే వాహనదారుడు ఎలాంటి పొరపాట్లు చేస్తారు అన్న విషయాన్ని ఇక ఈ వీడియో ద్వారా అందరికీ అర్థం అయ్యేలా చేశాడు. ఇది విదేశాలలో జరిగినట్లు తెలుస్తుంది. ఒక ట్రక్ డ్రైవర్ సిగ్నల్ దగ్గర తన వాహనాన్ని ఆపాడు. అయితే ట్రక్కు ముందు భాగంలో ఎడమవైపు బైక్ ఉన్నట్లు కనిపించలేదు. డ్రైవర్ వ్యూ ఇలా ఉంటుందని చూపిస్తూనే ఇక బైకులు ఎలా ఆపకూడదు అన్న విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా వీడియో తీశాడు. అందుకే ట్రక్ పక్కన ఎవరూ కూడా ఇలా వాహనాలను ఆపవద్దని ఈ వీడియో ద్వారా అందరికీ ఒక మెసేజ్ ని ఇచ్చాడు ఈ ట్రక్కు డ్రైవర్.

మరింత సమాచారం తెలుసుకోండి: