విషయం ఏమిటంటే, తాజాగా చైతూ సామ్ లకు సంబంధించిన పాత వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అక్కినేని నాగచైతన్య , సమంతల గురించి అందరికీ తెలిసిందే. ఎంతో అన్యోన్యంగా సాగిన వీరి దాంపత్య జీవితం ఏమైందో తెలియదు గానీ.. వీరు సడెన్ గా ఓ రోజు విడాకులు తీసుకుని తమ బంధాన్ని తెంచుకున్నారు. ఈ విషయం అప్పట్లో కేవలం అక్కినేని ఫ్యాన్స్ కే కాదు.. ఇండస్ట్రీని మొత్తం షేక్ చేసింది. ఇకపోతే తాజాగా నాగచైతన్య సమంతలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా సమంత నాగచైతన్యకు సంబంధించిన ఓ ఈ వీడియో నెట్ ఇంట్లో తెగచిక్కర్లు కొడుతుంది.
అందులో.. సమంత హోస్ట్ గా వ్యవహరించగా.. నాగచైతన్య గెస్ట్ గా వచ్చినట్లు అర్ధం అవుతోంది. మీరు ఎప్పుడైనా చీటింగ్ చేస్తూ దొరికిపోయారా? అంటూ సమంత ప్రశ్నించగా.. చైతు సమాధానం ఇస్తూ.. అవునని చెప్పాడు. అందులో లేట్ నైట్ పార్టీలకు వెళ్లడం కోసం అబద్ధం చెప్పానని చైతన్య ఒప్పుకోవడం మనం గమనించవచ్చు. ఒకే టైంలో ఎక్కువ మంది అమ్మాయిల్ని ఫ్లర్ట్ చేశావా? అని చైతూను ప్రశ్నించగా.. నాగచైతన్య సమాధానం ఇవ్వలేక పోవడంతో తన ఫ్రెండ్ రాహుల్ కి కాల్ కాల్ చేసి అదే ప్రశ్న అడుగుతుంది. దీంతో చైతు ఫ్రెండ్ రాహుల్ రిప్లై ఇస్తూ.. చైతుకు ఆ అవసరం లేదని అమ్మాయిలే వాడి వెంబడి పడతారంటూ సమంతకు దిమ్మ తిరిగిపోయే సమాధానం ఇస్తాడు. దీంతో సమంత కాస్త ఫీల్ అవుతుంది. ఆ తరువాత చై మాట్లాడుతూ ఇప్పటివరకు నువ్వు నన్ను ప్రశ్నించావు కదా.. నేను నిన్ను ఓ ప్రశ్న అడగనా అంటూ.. రిక్వెస్ట్ చేస్తాడు. కానీ ఇది నా షో అంటూ బదిలిస్తుంది! దీనికి సంబందించిన వీడియోని జనాలు షేర్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు.