పుష్ప సినిమా విడుదలైనప్పటి నుంచి ఎర్రచందనం గురించి ఎక్కువగా చాలామంది తెగ వెతికేస్తూ ఉన్నారు. అయితే ఇటీవలే మళ్లీ పుష్ప-2 చిత్రం విడుదల కాగా ఎర్రచందనం గురించి పలు విషయాలు వైరల్ గా మారుతున్నాయి. ఎర్రచందనం చెట్టును నరికి విక్రయిస్తే కోట్ల రూపాయలు సాధించడం సులువేనా అనే విధంగా పుష్ప చిత్రంలో చూపించారు.. పుష్ప చిత్రంలో చూపించిన విధంగా ఎర్రచందనం మార్పిడి చాలా ఖరీదైనదా దీనివల్ల ఎలాంటి లాభం ఎర్రచందనం ఎందుకు ఉపయోగపడుతుంది. ఒకవేళ కేజీ అమ్మితే ఎంత వస్తుందనే విషయంపై ఎప్పుడు కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నాయి.


ఎర్రచందనం ఇండియాకి చెందిన చాలా ఖరీదైన మొక్కగా పిలవబడుతోంది. ఈ మొక్క ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు ,కర్ణాటక రాష్ట్రాలలో ఎక్కువగా కనిపిస్తోందట. ఈ చెట్లు ఎక్కువగా సతత హరిత అడవులలోనే కనిపిస్తాయట. ఈ చెట్టు హైట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ చెట్టు ఎరుపు రంగులో ఉంటుంది చాలా దృఢంగా కూడా ఉంటుందట.. ఈ ఎర్రచందనం మొక్క దట్టమైన అడవులలో ఎక్కువగా పెరుగుతాయి. ఈ చెట్టు కలపను ఫర్నిచర్ విగ్రహాల తయారీ ఇతర వస్తువుల తయారీకి ఉపయోగిస్తారట.


ఎర్రచందనంతో తయారు చేసిన ఎలాంటి వస్తువైనా సరే చాలా ఖరీదైనదట. అందుకే ఈ ఎర్రచందనం మొక్కలకు ఎక్కడ చూసినా భారీ డిమాండ్ ఉంటుంది. ఎర్రచందనం సగటు కిలో ధర రూ  50 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉంటుందట.. అయితే అందులో నాణ్యతను బట్టి రెండు లక్షలకు పైగా కూడా ఉంటుందని సమాచారం. ఎర్రచందనం అధికంగా ఔషధ గుణాల తయారీలో ఉపయోగిస్తారు.. ఇవి ఎన్నో ఆరోగ్య సమస్యలను కూడా దూరం చేయడానికి ఉపయోగపడుతుందట. ఇందులో క్రిమినాశక్క గుణాలు గాయాలను నయం చేయడానికి ఉపయోగపడుతుందట. అలాగే కాస్మోటిక్ ఉత్పత్తులలో చర్మ సంరక్షణకు అవసరమైన మూలికలుగా  కూడా ఉపయోగపడుతుందట.. 1966 వరకు ప్రపంచంలోనే ఇండియాలో ఎర్రచందనం ఉత్పత్తి చేసే దేశంగా పేరు సంపాదించిందట కానీ ఆ తర్వాత ప్రభుత్వ చర్యల కారణంగా ఈ గంధపు చెక్కల ఉత్పత్తి చాలా తగ్గిపోయిందని సమాచారం. ఇప్పుడు ఆస్ట్రేలియాలో ప్రపంచంలోనే అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశంగా పేరు పొందినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: