అది కాస్త ఆంజనేయ స్వామికి సంబంధించి కావడంతో జనాలు ఆ వీడియోని తెగ షేర్ చేస్తున్నారు. అవును, మీరు విన్నది నిజమే. సోషల్ మీడియాలో సాక్షాత్తు ఆంజనేయ మూర్తి కంటతడి పెట్టుకుంటున్నట్లు ఓ వీడియో దృశ్యాలు ఉండడంతో చాలామంది ఆశ్చర్యానికి గురవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారి తీస్తోంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కాన్పూర్ సంబంధించిన కోయిలా నగర్‌కు చెందినదిగా పోలీసులు చెబుతున్నారు. ఇక్కడ ఉన్న ఓ హనుమాన్ మందిరంలో సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డయినట్లు కూడా వారు వెల్లడించారు. దాంతో చాలామంది భక్తులు ఈ విషయాన్ని తెలుసుకొని దేవాలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని, తాము తెలుసుకున్న విషయం నిజమా కాదా అనే విషయం తెలుసుకొనే విషయంలో పడ్డారు.
అయితే అధికారిక సమాచారం ప్రకారం అయితే, ఈ వీడియో ఫేక్ అని.. కొంతమంది కావాలనే యానిమేట్ చేశారని చెబుతున్నారు. అలా యానిమేట్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది. అయితే సోషల్ మీడియాలో పోస్ట్ వ్యక్తే స్వయంగా హనుమంతుడు ఏడుస్తున్నట్లు ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేశారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వీడియోపై పూర్తిగా ఎంక్వయిరీ చేసిన పోలీసులు కూడా నిజం తేల్చేశారు. ఈ వీడియో ఉత్తిదేనని కావాలని కొంతమంది హనుమంతుడు ఏడుస్తున్నట్లు ఎడిటింగ్ చేసి పెట్టారని చెప్పుకొచ్చారు.