ప్యాన్ ఇండియా స్థాయిలో రిలీజైన ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నపటికీ చాలా ఏరియాల్లో భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడంతో ఓ రకంగా నిర్మాతలకు సేఫ్ అయింది. అయితే డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం చాలా నష్టం జరిగిందని అప్పట్లో వార్తలు హల్ చల్ చేసేవి. మొత్తంగా ఈ సినిమా 200 కోట్ల మార్కును చేరుకొని బతికిబట్టగలిగిందని విశ్లేషకులు అనేవారు. ఇక అది అప్రస్తుతం గానీ, ఈ సినిమాలోని డార్లింగ్ ప్రభాస్ కదులుతున్న రైలులోనుండి హీరోయిన్ పూజ బయటకు వేలాదిగా ప్రభాస్ చాలా రొమాంటిక్ గా ఆమెని కౌగిలించుకుంటాడు. అయితే ఆ సీన్ ని ఒక చైనా మహిళ అనుకరించి ప్రస్తుతం విమర్శలపాలవుతోంది.
విషయం ఏమిటంటే... శ్రీలంకలో కదులుతున్న రైలులో ఓ చైనా మహిళ రైలు కదులుతున్నప్పుడు అదే మాదిరి బయటకు వేలాడుతూ కనిపించడంతో జనాలు కంగారు పడ్డారు. అయితే ఈ క్రమంలో ఆమె అలా వేలాడుతూ... ప్రమాదానికి గురవ్వడం ఇక్కడ జరిగింది. ఆమె అలా బయటకు వేలాడుతూ ఉండగా ఓ చెట్లున్న పొద తగలడంతో ఆమె ఒక్కసారిగా పట్టు కోల్పోయింది. తర్వాత ఆమె తన పట్టును పూర్తిగా కోల్పోయి రైలు నుండి పడిపోతుంది. అయితే అదృష్టవశాత్తూ, రైలు తదుపరి స్టేషన్‌లో ఆపివేయడంతో ప్రయాణీకులు ఆమెకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. దేవుని దయ వలన ఆమె చిన్న చిన్న గాయాలతో బయటపడిందని చెబుతున్నారు. దాంతో ఈ వీడియో వైరల్ అవుతోంది.