పల్నాడు జిల్లాలో ఇటీవలే ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.. ఒక యువతి కిరాతకం పోలీసులను సైతం ఆశ్చర్యపోయేలా చేసింది.. ముఖ్యంగా కుటుంబ ఆస్తితో పాటు తండ్రి పెన్షన్ కి అడ్డు తగులుతున్నారనే కోపంతో ఒక యువతి తన అన్న తమ్ముడిని ప్లాన్ ప్రకారం హత్య చేసిందట. అలా చేయడమే కాకుండా శవాలను కూడా మాయం చేసిన ఘటన ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది




అసలు విషయంలోకి వెళ్తే పల్నాడు జిల్లాలోని నకరికల్లు కాలనీకి చెందిన పౌలు రాజు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారట. ఈయన గిరిజన సంక్షేమ పాఠశాలలో గవర్నమెంట్ టీచర్ గా ఉన్నారట. దీంతో పక్షవాతంతో కొద్దిరోజుల క్రితం ఆయన మరణించగా.. ఆయన భార్య కొన్నేళ్ళ క్రితమే అనారోగ్య సమస్యతో మరణించిందట. వీరికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. పౌలు రాజు పెద్ద కుమారుడు గోపికృష్ణ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పని చేస్తున్నారట.. ఇక రెండవ సంతానమైన కూతురు కృష్ణవేణి పెళ్లయిన తర్వాత కుటుంబ కలహాలతో భర్తను విడిచి పుట్టింట్లోనే ఉన్నదట. మూడవ సంతాన దుర్గ రామకృష్ణ కు వివాహమైన కూడా కొన్ని కారణాల చేత భార్యను విడిచిపెట్టారట. పెద్ద కుమారుడు గోపికృష్ణ భార్య కూడా వదిలిపెట్టడంతో ముగ్గురు తండ్రి దగ్గరే ఉండేవారట.



ఇక తండ్రి మరణించిన తర్వాత ఆస్తి కోసం ముగ్గురు మధ్య ఎక్కువగా గొడవలు జరిగేవట. అయితే కూతురు మాత్రం తన తండ్రి బాగోగులను తానే చూసుకున్నానని డబ్బు మొత్తం తనకే దక్కాలని గొడవపడేదట. కానీ ఆస్తిని మాత్రం తమ చెల్లెలికి ఇచ్చేందుకు అన్నదమ్ములు ఇద్దరు ఒప్పుకోలేదు.. ఇలాంటి విషయాలన్నీ మనసులో పెట్టుకున్న కృష్ణవేణి ఆస్తికోసం అన్నదమ్ములను హత్య చేయాలని ప్లాన్ చేసిందట. ఈ క్రమంలోనే మద్యం తాగి అలవాటు గోపికృష్ణకు ఉండడంతో డిసెంబర్ 10న తన అన్నకు మద్యం తాగించి చున్ని బిగించి హత్య చేసిందట.. నవంబర్ 26న తన తమ్ముడిని కాలువలోకి తోసేసి చంపేసిందట. ఇలా వీరిద్దరి మృతి దేహాలు ఇప్పటికీ కూడా దొరకలేదని సమాచారం.


అయితే ఇదంతా ఇలా ఉండగా అదే ఊరిలో కృష్ణవేణికి మరొక వ్యక్తి తో సంబంధం ఉన్నట్లు అక్కడి స్థానికులు తెలియజేశారట.. అతని సహాయంతోనే వీరిని హత్య చేసినట్లు సమాచారం. అయితే కానిస్టేబుల్ గోపికృష్ణ పోలీస్ స్టేషన్ విధులకు హాజరు కాకపోవడంతో వీరి హత్య వ్యవహారం బయటకి వచ్చిందట. మొత్తానికి కృష్ణవేణి అరెస్టు చేసి పోలీసులు విచారణ చేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: