అవును, తాజాగా జరిగిన ఓ పెళ్లి వేడుకలో వధువు సోదరి ఓ బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేయగా, ఆ సమయంలో ఆమె వరుడితో ప్రవర్తించిన తీరు అక్కడున్నవారికి సైతం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ముఖ్యంగా వధువు ఆ డ్యాన్స్ చూసి అవాక్కయింది. ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ అయిన ఆ వైరల్ వీడియో ప్రకారం చూసుకుంటే, వధూవరులు వేదికపై సోఫాలో కూర్చున్నారు. ఆ సమయంలో బాలీవుడ్ హిట్ సాంగ్ "వో జింకే ఆగే జీ, వో జింకే పేచే జీ.." సాంగ్ ప్లే కావడంతో, వధువు సోదరి డ్యాన్స్ చేయడం మొదలు పెట్టింది. ఈ క్రమంలో ఆమె వరుడితో హద్దు మీరి ప్రవర్తించడంతో అంతా ఖంగు తిన్నారు. డ్యాన్స్ వేస్తూ వరుడి ఒళ్లో కూర్చోవడం, వరుడి మెడ చుట్టూ చేతులు వేసి కౌగిలించుకోవడం వంటి పనులు చేసింది.
ఇక ఆమె డ్యాన్స్‌కు అయితే వరుడు సిగ్గుపడి చచ్చిపోయాడు. దాంతో పక్కనే కూర్చున్న వధువు కోపంగా చూస్తూ సైలెంట్‌గా ఉండిపోయింది. ఇక ఆ వేడుకకు వెళ్లిన అతిధులు కొందరు ఆమె డ్యాన్స్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 9 లక్షల మంది వీక్షించగా, 89.5 వేల మంది లైక్ చేశారు. కాగా ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు. "థాంక్ గాడ్. నాకు అలాంటి చెల్లి లేదు!" అని కొందరు కామెంట్ చేస్తే, "పాపం పెళ్లి కూతురు!" అంటూ కొందరు, "ఇక ఆమె తన చెల్లిని ఎప్పుడూ తన అత్తారింటికి రానివ్వదు!" అంటూ కామెంట్లు చేస్తుండడం ఇక్కడ గమనించవచ్చు.