ఇక అలా ఆత్మహత్య చేసుకున్న అయ్యప్ప భక్తుడు కర్ణాటక ప్రాంతానికి చెందిన కన్నపురకు చెందిన కుమారస్వామి అన్నట్టుగా సమాచారం.. శబరిమల సన్నిధానం మల్లికాపురం సన్నిధి నుంచి ఒక్కసారిగా కిందికి దూకడం జరిగిందట .అయితే ఈ ఘటనలో ఆ వ్యక్తికి సైతం గాయాలయ్యాయని.. దగ్గరలో ఉండే మెడికల్ కాలేజీలో చికిత్స అందించినట్లు సమాచారం. అక్కడ చికిత్స అందించిన ఫలితం లేక కుమారస్వామి మరణించినట్లుగా భక్తులు తెలియజేస్తున్నారు. కుమారస్వామి పైనుంచి దూకడంతో గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయినట్లుగా అక్కడ వైద్యులు తెలియజేశారట.
అయితే కుమారస్వామి మరణానికి గల కారణం ఏంటో తెలియదు కానీ వినిపిస్తున్న సమాచారం మేరకు మానసిక రుగ్మతలతో ఇబ్బంది పడుతున్న కుమారస్వామి అయ్యప్ప స్వామి ఆలయంలో ఇలాంటి ఆకృతానికి పాల్పడ్డాడని సమాచారం. మొత్తానికి ఒక్కసారిగా శబరిమలలో కూడా ఇలాంటి ఘటన జరగడంతో భక్తులు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. దీంతో అక్కడ అధికారులు కూడా రాబోయే రోజుల్లో ఇలాంటివి జరగకుండా మరింత కట్టుదిట్టమైన సెక్యూరిటీని కూడా బిగిస్తామంటూ తెలియజేస్తున్నారు. రాబోయే రోజుల్లో శబరిమలలో కూడా కొన్ని నిబంధనలు పెట్టబోతున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు జరగకుండా మరి అక్కడ ప్రభుత్వాలు ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారా చూడాలి మరి.