ఈ మధ్యకాలంలో చాలామంది మహిళలు ,పురుషులు కూడా పెళ్లి విషయంలో ఎన్నోసార్లు మోసపోతూ ఉన్నారు.. ఎక్కువమంది బంగారు డబ్బు కోసమే ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా  మ్యాట్రిమోనీ సైట్లో పెళ్లిళ్లు కుదిర్చి మరి కమిషన్లు తీసుకొనే రోజులు ఇప్పుడు వచ్చేసాయి. అయితే ఇలాంటి పెళ్లిళ్లు సక్సెస్ అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు.. కానీ మోసగాళ్ల బారిన పడితే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఈజీ మనీ కోసం ఇలాంటి మ్యాట్రిమోనీ సైట్లను సైతం ఒక అడ్డాగా మార్చుకుంటున్నారు.



అలా ఇప్పుడు వంశీకృష్ణ అనే కేటుగాడు బారిన 50 మంది మహిళలు పడ్డట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వంశీకృష్ణ హైదరాబాదులో గచ్చిబౌలిలో నివసిస్తూ ఉంటారట.తాను ఒక ధనవంతుడిగా మాట్రిమోనీ సైట్స్ లో పరిచయం చేసుకొని తన నెత్తి మీద జుట్టు లేకపోయినా విగ్గులు పెట్టుకుని తన లుక్స్ని సైతం మారుస్తూ పలు రకాల ఫోటోలను అప్లోడ్ చేస్తూ.. పెళ్లి కొడుకు కోసం వెతుకుతున్న అమ్మాయిలకు, అలాగే అమ్మాయిల తల్లిదండ్రులకు సైతం డబ్బున్నోడిగా అందగాడుగా అనేఫీల్ ని సైతం క్రియేట్ చేస్తూ ఉంటారట వంశీకృష్ణ.



అలా మ్యాట్రిమోనీ డాట్ కాం లో రిచ్ గా ఉండే ఫోటోలని పెట్టి తనకు వధువు కావాలంటూ ప్రొఫైల్ ను అప్లోడ్ చేస్తూ ఉంటారు.. ఒకవేళ ఇతనిని నమ్మి అతనికి అమ్మాయిలను ఇచ్చి వివాహం చేస్తే లక్షలలో కట్నం తీసుకున్న తర్వాత కొద్ది రోజులకే ముఖం చాటేస్తూ ఉంటారట. ఆ తర్వాత మరొక గెటప్ తో మళ్ళీ ప్రొఫైల్ ని అప్లోడ్ చేస్తూ ఉంటారట ఈ వంశీకృష్ణ. ఇలా వచ్చిన డబ్బులతో లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారట. ఇలా విగ్గులు మార్చుకొని వేషాలు మార్చుకొని మోసాలకు పాల్పడుతూ ఇప్పటికి 50 మంది అమ్మాయిలను పెళ్లి చేసుకొని మోసం చేశారట. ఒక లేడీ డాక్టర్ ఇలాగే మోసపోవడంతో ఇతని మోసాన్ని గ్రహించి సైబర్  క్రైమ్ కి ఫిర్యాదు చేసిందట. దీంతో ఈ నిత్య పెళ్లి కొడుకు కేసులు పలు రకాల ట్విస్టులతో కూడిన విషయాలను పోలీసులు తెలియజేశారు.. ఈ వంశీకృష్ణ పైన ఇప్పటికే చాలానే కేసులు కూడా నమోదు అయ్యాయని జైల్లో పెట్టిన కూడా ఇతని బుద్ధి మాత్రం మారలేదంటూ పోలీసులు తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: