ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ చూసినా మార్కెట్లో ఎలాంటి వస్తువులు కొనాలన్నా కూడా ఒకటికి పది సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.. ఎందుకంటే ప్రతి వస్తువులో కూడా కల్తీ విపరీతంగా పెరిగిపోవడంతో ఏది ఒరిజినల్ ఏది నకిలీ అని తెలుసుకోవడం చాలా కష్టంగా మారిపోతున్నది. వీటికి తోడు కొన్ని వీడియోలను వైరల్ గా చేస్తూ.. వీటిని ఎలా తయారు చేస్తున్నారో అనే వాటిని చూపిస్తూ ఉండడంతో చాలామంది కొన్నిటిని తినడానికి ఇష్టపడడం లేదు. ఇప్పటివరకు మన ప్లాస్టిక్ బియ్యం, కోడిగుడ్డు, ఇతరత్రా వాటిని చూశాము కానీ ఇప్పుడు తాజాగా ఒక మహిళ తానుకొన్న ఒక క్యాబేజీ ను చూపించి అందరికీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.


సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారుతున్నది. ఒక మహిళ మార్కెట్ కి వెళ్లి అక్కడ నుంచి క్యాబేజీని తెచ్చుకోగా ఆ క్యాబేజీని కట్ చేసిన తర్వాత వంట చేసే సమయంలో ఆమెకు ఎందుకో అనుమానం వచ్చిందట. దీంతో ఆ క్యాబేజీ ఆకును చేతితో తీసుకొని పరిశీలించిన తర్వాత దానిని స్టవ్ పైన పెట్టి కాల్చి చూపించింది.. చివరిగా దాన్ని పరిశీలించగా అది ఒక రబ్బర్ అన్నట్లుగా తేలిపోవడంతో ఆమె షాక్ గురయ్యానంటూ తెలిపింది.



ఈ క్యాబేజీ రబ్బర్ల సాగుతోందని తెలియజేస్తోంది. అసలు ఇది క్యాబేజీనే కాదు నకిలీది అంటూ ఆమె వివరించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. దీనిపైన చాలామంది నెటిజన్స్ భిన్నాభిప్రాయాలను సైతం తెలియజేస్తున్నారు. కొంతమంది ఇది ఫేక్ వీడియో అని చెబుతూ ఉండగా మరి కొంతమంది రాబోయే రోజుల్లో అన్నిటిని ప్లాస్టిక్ కి ముంచేస్తుందేమో తినాలంటేనే భయమేస్తోంది  అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ వీడియోని 800 వందల మందికి పైగా లైక్స్ కామెంట్లతో తెగ వైరల్ గా చేశారు. అందుకే మార్కెట్ కి వెళ్ళినప్పుడు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని తీసుకోవడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: