ఓరియో బిస్కెట్స్ గురించి జనాలకి చెప్పాల్సిన పనిలేదు. ఈరోజుల్లో ముఖ్యంగా చిన్నపిల్లలు ఓరియో బిస్కెట్స్ కావాలని తమ తల్లిదండ్రులను మారాం చేస్తూ ఉంటారు. అదే సమయంలో చాలామంది పేరెంట్స్ ఉదయం లేదా సాయంత్రం స్నాక్ రూపంలో బిస్కెట్లను పెడుతూ ఉంటారు. ఈ బిస్కెట్లు తినడానికి రుచికరంగా ఉంటాయి కానీ అవి ఆరోగ్యానికి అంత మంచివి కాదని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉన్నారు. ఇక ఒరియా బిస్కెట్స్ సాధారణంగా 2 ఫ్లేవర్లలో అందుబాటులో ఉంటుంది. ఒకటి మిల్క్ ఫ్లేవర్ అయితే మరొకటి చాక్లెట్ ఫ్లేవర్. ఈ బిస్కెట్‌ యాడ్ విపరీతంగా వైరల్ కావడంతో పిల్లలు ఎక్కువగా వాటిని తినాలని కోరుకుంటూ ఉంటారు.

అసలు విషయంలోకి వెళితే... ఈ ఓరియో బిస్కెట్ల గురించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం ఇపుడు అందరినీ షాక్ కి గురి చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోని గమనిస్తే, అందులో ఒరియాని ఎక్కువసేపు కాల్చారు. అలా దాదాపు 30 సెకండ్ల పాటు కాల్చినా  ఓరియో బిస్కెట్ మాత్రం కాలదు. ఈ క్రమంలోనే బిస్కెట్లు తినటం మంచిదేనా? అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో చాలామంది రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఒక చెక్క ఫ్రేమ్ మీద ఓరియో బిస్కెట్లు పెట్టి కాల్చగా, చెక్క ఫ్రేమ్ కాలింది కానీ బిస్కెట్ మాత్రం కాలలేదు. దీంతో ఈ వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. పిల్లలు ఇష్టంగా తినే ఈ ఓరియో బిస్కెట్ ఇలా కాలిపోలేదు ఏంటి అని ఇపుడు సర్వత్రా చర్చనీయాంశం అయింది.

విషయం ఏమిటంటే, వీటి తయారీలో... చక్కెర, అన్ బ్లీచ్ చేసిన పిండి, ఐరన్, నియాసిన్, మోనో మోనిట్రేట్ తియమిన్, కార్న్‌ ఆయిల్, రైబోఫ్లెవిన్, సోయాబీన్ కోకోవా, కేనోలో ఆయిల్ వంటి ఉపయోగించి తయారు చేస్తారు.. ఇంకా ఇందులో కార్న్‌ సిరప్, బేకింగ్ సోడా, ఉప్పు, సోయా లేసితిన్, చాకోలెట్ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ కలిపి తయారుచేస్తారు. అయితే ఇలాంటి ప్రాసెస్ చేయబడిన బిస్కెట్లను పిల్లలకు పెట్టడం వలన అనేక రకాల అనారోగ్యకరమైన ఇబ్బందులను ఎదుర్కొంటారని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఒరియా క్రీమ్ బిస్కెట్స్ పిల్లలకు అస్సలు పెట్టొద్దని అంటున్నారు. ఈ తరుణంలో కొంతమంది మా పిల్లలకు ఈ బిస్కెట్లు పెట్టం అని కూడా పోస్టులు పెడుతున్నారు. అదే సమయంలో బిస్కెట్స్ తయారు చేసే ప్రాసెస్ కూడా చాలా ఎబ్బెట్టుగా ఉందని జనాలు కామెంట్స్ చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: