కదులుతున్న వాహనాల్లోంచి వారు చూస్తుండగానే, ఓ పులి వీధి కుక్కలా రోడ్డుపై నడుచుకుంటూ వచ్చింది. అంతలోనే ఎదురుగా ఓ ఆవు కనిపించింది. క్షణాల్లో సీన్ మారిపోయింది. పర్యాటకులు కళ్లు చెదిరేలా, వారి వాహనాలు కదులుతుండగానే, పులి మెరుపు వేగంతో ఆవుపై దాడి చేసింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ ఆవును అడవిలోకి లాక్కెళ్ళింది. ఈ దృశ్యాన్ని చూసిన పర్యాటకులు షాక్‌కు గురయ్యారు. దాన్ని వీడియోలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘పులి వేట ఇంత భయంకరంగా ఉంటుందా?’ అంటూ భయంతో, ఆశ్చర్యంతో కామెంట్లు చేస్తున్నారు.
వైరల్ వీడియోలో చూసినట్లుగా, ఆకలితో రగిలిపోతున్న ఆ పులి కళ్లు ఆవుని చూడగానే లేజర్‌లా ఫోకస్ అయ్యాయి. ఇక వేట మొదలెట్టింది. సైలెంట్‌గా వెనకాలే ఫాలో అయి కరెక్ట్‌గా టైమ్ చూసి ఒక్కసారిగా పంజా విసిరింది. ఊహించని దాడికి ఆవు బిత్తరపోయింది. తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేసింది. కానీ, పులి పట్టుదల ముందు దాని ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరులా అయ్యాయి.
పులి తన బలమైన దవడలతో ఆవు మెడను గట్టిగా పట్టుకుంది. ఊపిరి ఆడక ఆవు కొట్టుమిట్టాడుతోంది. చివరికి ఆవు నేలకొరిగింది. అంతే! ఇక పులి తన పని మొదలుపెట్టింది. ఆవును ఈడ్చుకుంటూ అడవిలోకి మాయం అయిపోయింది. ఇదంతా సినిమా చూస్తున్నట్టు పర్యాటకుల కళ్లముందే జరిగింది.ఈ ఘటనకు సంబంధించిన వీడియో చూసి ‘వామ్మో! టైగర్ హంటింగ్ ఇంత క్రూరంగా ఉంటుందా?’ అని కొందరంటే, ‘పాపం ఆవు!’ అని మరికొందరు జాలి పడుతున్నారు. ఎమోజీలతో తమ భావాలను వ్యక్తం చేస్తున్నారు ఇంకొందరు. వీడియోకి లైకుల, వ్యూస్‌ల వర్షం కురుస్తోంది. ఇప్పటికే 15 వేలకు పైగా లైకులు, 6 లక్షలకు పైగా వ్యూస్‌తో రికార్డులు క్రియేట్ చేస్తోంది.