సోషల్ మీడియా హవా ఎక్కువవడంతో ఈమధ్య కాలంలో చూస్కుంటే... చాలామంది రీల్స్ మోజులో పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అవును.. ఈ క్రమంలో టెర్రస్, ఎత్తైన జలపాతాలు, కొండలు - కోనలు, బిజీ రోడ్స్, రైల్వే ట్రాక్స్‌, వెహికల్స్ ఇలా ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ.. వారు ఇబ్బంది పడడమే కాకుండా ఎదుటివారిని సైతం ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. దీని వల్ల ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మరికొంతమంది తీవ్ర గాయాల పాలై కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు అవుతున్నారు. ఈ రీల్స్ చేయడం వల్ల వారికి ఒరిగేది ఏమీ లేదుకానీ ఈ మోజులో పడి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అనడంతో ఎటువంటి అతిశయోక్తి లేదు!

ఇక తాజా సంఘటన కూడా దానికి ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. విషయం ఏమిటంటే, కొంతమంది పోకిరీ యువకులు, యువతులు రహదారిపైన రీల్స్ చేస్తూ వీడియో షూట్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. వీడియో ప్రకారం చూసుకుంటే మొత్తం 6 మంది ఓ రీల్ రికార్డ్ చేసే పనిలో బిజీగా ఉంటూ వెనుకనుండి వేగంగా దూసుకు వచ్చే కారుని గమనించలేకపోయారు. దాంతో ఆ కారు వారిని ఢీకొట్టింది. దాంతో వారందరూ గాయాలపాలైనట్టు సమాచారం. సదరు వీడియో ఇపుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ కావడంతో జనాలు వారిని ఇష్టమొచ్చినట్టు తిడుతున్నారు. అమ్మ బాబులు చదువుకొమ్మని కాలేజులకి పంపిస్తుంటే వీరికి తిన్నది అరక్క ఇలా పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అయితే ఇదే తరహా ఘటన ఇటీవల బిజ్నోర్‌లోని కిరత్‌పూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. రీల్ కోసం నలుగురు యువకులు బిజీ రోడ్డు పైకి వెళ్లారు. అదే లేన్‌లో చాలా వేగంగా వస్తున్న కారు వీరిని వేగంగా ఢీ కొట్టడంతో సమర్‌, నోమాన్ అనే ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జాతీయ రహదారిపై తాజాగా జరిగింది. ముందలా గ్రామానికి చెందిన ఈ ఇద్దరు యువకులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా అపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రస్తుతం ఇద్దరు బాధితులకు ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారు. ఈ ఘటన ప్రతి ఒక్కరికి ఒక పాఠం కావాలని చాలామంది నెటిజన్లు కోరుతున్నారు. బిజీ రోడ్లపై జాగ్రత్తగా వెళ్లాలని సూచిస్తున్నారు. మరోవైపు ఒక పదహారేళ్ల అమ్మాయి టెర్రస్ పైన రీల్స్ తీస్తూ 6వ అంతస్తు పైనుంచి కింద పడింది. అయితే అదృష్టవశాత్తూ మొక్కపై పడటం వల్ల ఆమె చనిపోకుండా ఈ ప్రమాదం నుంచి బయటపడింది. కానీ ఛాల్తీ గాల్లో కలిసిపోయేదే! కాబట్టి ఒళ్ళు జాగ్రత్త సుమీ!

మరింత సమాచారం తెలుసుకోండి: