అందుకే మన దేశానికి చెందిన ఆ సింగ్ ని ఇపుడు జనాలు సింగ్ ఈజ్ కింగ్ అంటూ సంబోధిస్తున్నారు. ఈ ఉద్యోగి వార్షిక జీతం రూ.17,500 కోట్లు. అంటే రోజుకు అక్షరాలా రూ.48 కోట్ల రూపాయిలు అన్నమాట. దాంతో ఈ విషయం ఇపుడు సర్వత్రా హాట్ టాపిక్ అవుతోంది. చాలా మంది ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు మరి. మొత్తానికి ప్రతీ భారతీయుడు గర్వంగా చెప్పుకునే వార్త ఇది. ఎందుకంటే ప్రపంచంలో ఇతనిదే అత్యధిక శాలరీ కావడం విశేషం. ఇంత పెద్ద మొత్తంలో జీతం తీసుకుంటున్న అతని పేరు "జగ్దీప్ సింగ్."
క్వాంటం స్కేప్ వ్యవస్థాపకుడు అయినటువంటి జగ్దీప్ సింగ్, అదే కంపెనీకి సీఈవో ఉన్నాడు. పెట్టుబడితో పని లేకుండా నెలకు ఆయనకు ఠంచన్‌గా డబ్బు చేతిలో పడుతుందన్నమాట. అతని జీతం నెలకు రూ. 1,459 కోట్ల కాగా ఏడాదికి 17,500 కోట్లు, రోజువారి లెక్క చూస్తే రూ.48 కోట్లుగా ఉంది. బడా వ్యాపారవేత్తల ఆదాయం తలదన్నే అంత జీతం తీసుకుంటున్న జగ్దీప్ సింగ్ ప్రపంచంలోనే అత్యధిక శాలరీ తీసుకుంటున్న ఉద్యోగిగా ప్రస్తుతం రికార్డుల్లోకి ఎక్కాడు. జగ్దీప్ సింగ్ క్వాంటం స్కేప్ సీఈవో మాత్రమే కాదు ఈ కంపెనీ వ్యవస్థాపకుడు కూడా. భారతీయుడి ఖ్యాతి గురించి ఆన్ స్టాప్ అనే సంస్థ ఓ నివేదికలో ఈ ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించడం విశేషం. ఈ టాప్ మోస్ట్ శాలరీ తీసుకుంటున్న ఉద్యోగి అమెరికాలోని స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి బీటెక్ పట్టభద్రుడయ్యాడు. అటుపై కాలనిఫోర్నియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందారు కూడా.ఇక ఇక్కడ షాక్ ఏమిటంటే... వేల కోట్ల జీతగాడిగా మారక ముందు జగ్దీప్ సింగ్ అనేక కంపెనీల్లో జీతానికి కీలక ఉద్యోగాలు చేశారు. ఎప్పుడైతే ఆయన 2020లో క్వాంటం స్కేప్ కంపెనీ స్థాపించారో అప్పటి నుంచి సింగ్ ఈజ్ కింగ్ గా మారాడు.