తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న వీడియోని చూస్తే రెస్టారెంట్లకు వెళ్లాలి అంటే భయం వేస్తోంది అన్నట్లుగా కనిపిస్తోంది. ఈ వీడియోలో వంట గదిలో అమర్చిన సిసి కెమెరాలు రికార్డ్ అయిన వీడియో ప్రకారం ముందుగా ఒక వ్యక్తి రెస్టారెంట్లో ఉండేటువంటి సింక్లో కుక్కపిల్లకు స్నానం చేయిస్తూ ఉండగా.. ఆ పక్కనే వంట సిద్ధమవుతూ ఉన్నట్టు కనిపిస్తోంది అలాగే మరొక వ్యక్తి ఫ్లోర్ క్లీన్ చేస్తూ ఉడుస్తూ ఉన్న సమయంలోనే ఆ స్టిక్ తో పొయ్యి మీద వండుతున్న ఆహార పదార్థాలను కలిగవేస్తున్నట్టు కనిపిస్తోంది. అయితే ఈ వీడియో ఒకే రెస్టారెంట్ లోదా లేకపోతే వేర్వేరు రెస్టారెంట్ లోద అనేది తెలియాల్సి ఉన్నది.
ఈ వీడియో చూసిన సైతం దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇకమీదట ఎవరైనా రెస్టారెంట్ కి వెళ్లి తినాలి అంటే అసహ్యించుకునేలా ఇలా చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో ఎప్పటిదో అయినప్పటికీ సోషల్ మీడియాలో తాజాగా వైరల్ గా మారుతున్నది రెస్టారెంట్ కిచెన్ లో సీసీటీవీ ఉన్నది కాబట్టి ఇలాంటి సంఘటనలు బయటికి వచ్చాయని.. ఇలాంటి సంఘటనల పైన ఫుడ్ ఇన్స్పెక్టర్లు సైతం చర్యలు తీసుకోవాలంటూ హెచ్చరిస్తున్నారు. మరి కొంతమంది ఇంట్లోనే వండుకొని తినడం చాలా ఉత్తమము అంటూ కామెంట్స్ చేస్తున్నారు.