ఇటివలె కొంతమంది వ్యక్తులు, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చాలా తప్పుగా ప్రచారం చేస్తూ తన పరువును తీస్తున్నారంటూ గరికపాటి ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా ఆయన పైన చేసిన ఆరోపణలు నిరాధారమని, సత్యదూరం అంటూ పలు రకాల వేరువేరు ఘటనలో జరిగిన వాటన్నిటికీ కూడా ఎవరెవరికో చొప్పని క్షమాపణలు చెప్పినట్లుగా తెలియజేస్తున్నారు అంటూ తెలిపారు. అంతేకాకుండా ఆయన గౌరవానికి సైతం భంగం కలిగించేలా కొన్ని వీడియోలను ఫోటోలను దుష్ప్రచారం చేస్తున్నారంటూ తెలిపారు.
ఇక అంతటితో ఆగకుండా పారితోషకాలు, ఆస్తుల విషయంలో కూడా గరికపాటి గురించి అసత్య ప్రచారాలు జరుగుతూ ఉండడంతో వీటన్నిటిని తాను ఖండిస్తున్నాను అంటూ తెలిపారు.ఈ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్న కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇతరత్రా సంస్థల పైన కూడా క్రిమినల్ చర్యలు తీసుకొని పరువు నష్టం వేస్తామంటూ తెలియజేశారు. ఇకపై ఇలాంటి దుష్ప్రచారం చేస్తే కచ్చితంగా వారి పైన ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటామంటూ తెలియజేశారు గరికపాటి. అయితే గత కొంతకాలంగా ఏవేవో సినిమా పాటలకు ఆయన డైలాగులను కూడా యాడ్ చేస్తూ పలు రకాల వీడియోలను కూడా మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము.. ఇక మీదట ఇలాంటివి ఎవరు చేసినా కూడా గరికపాటి టీం ఉపేక్షించేది లేదంటూ చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరిస్తున్నారు. మరి ఇకనైనా ఆగుతాయేమో చూడాలి.