ముఖ్యంగా భోగి పండుగ రోజున పిల్లల తల పైన సైతం భోగి పళ్ళు పోసే సాంప్రదాయాన్ని మనం ఎన్నో ఏళ్లుగా చూస్తూనే ఉన్నాము.. అసలు ఆరోజు పిల్లల తలపై ఎందుకు భోగి పళ్ళు పోస్తారు? వీటి వెనుక పురాణాలు ఏం చెబుతున్నాయని విషయం చాలామందికి తెలియకపోవచ్చు.. ముఖ్యంగా భోగి రోజున పిల్లల తల పైన భోగి పళ్ళు పోయడం వల్ల నరదిష్టి పోతుందట. దీంతో నారాయణుడి అనుగ్రహం లభిస్తుందని మన పురాణాలు సైతం తెలియజేస్తున్నాయట. అంతేకాకుండా మన తలపై భాగంలో బ్రహ్మరథం ఉంటుందట. ఈ పండ్లను తలపై పోసినప్పుడు పిల్లలకు జ్ఞానం కూడా పెరిగేలా చేస్తుందని భావిస్తూ ఉంటారు.
అలాగే ఎరుపు రంగులో ఉండే భోగి పళ్ళు పోయడం వల్ల ఇది సూర్యుడు ప్రతికగా భావిస్తారు. వీటివల్ల సూర్యుడు ఆశీస్సులు కూడా ఉంటాయని భోగి పళ్ళను పిల్ల తల పైన పోస్తారట. మన పురాణాల ప్రకారం నారాయణుడు బోళా శంకరుడుని ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేస్తున్న సమయంలో దేవతలందరూ వచ్చి నారాయణుడి తల పైన ఫలాలను కురిపించారట. అందుకే దీని ప్రకారము చిన్నపిల్లలను కూడా నారాయణడిగా భావించి వారి తలల పైన భోగి పళ్ళు పోసే సంప్రదాయాన్ని పూర్వం నుంచి పాటిస్తున్నారని పురాణాలు తెలియజేస్తున్నాయట. అందుకే చాలామంది ప్రజలు కూడా సంక్రాంతి పండుగ రోజున ఈ భోగిపళ్ళను తల మీద పోస్తూ ఉంటారు.