ఎక్కువమంది పోలీస్ ఇన్ ఫార్మర్లుగా పనిచేసి ఎన్నో విజయాలను అందుకున్న వారిని మనం చూస్తూనే ఉన్నాము. కానీ నందాలాల్ అనే వ్యక్తి సుమారుగా 34 ఏళ్ల నుంచి హోంగార్డుగా ఉత్తరప్రదేశ్లో పనిచేస్తున్నారట. అయితే ఇతను ఒక గ్యాంగ్ స్టార్, దొంగ, మోసగాడు అనే విషయం పోలీసులకు తెలియదట. అయితే ఆ విషయం ఇప్పుడు ఎలా బయటపడింది మరి అధికారులు నందలాల్ ని ఏం చేశారనే విషయం పై ఇప్పుడు ఒకసారి చూద్దాం.


నందాల అసలు పేరు నక్డు.. 1988 లోని రౌడీషీటర్ల జాబితాలో ఇతని పేరు ఉన్నదట. దీంతో తన పేరును మార్చుకొని ఏకంగా పోలీస్ స్టేషన్లో హోంగార్డు ఉద్యోగాన్ని కూడా సంపాదించారు. అలా నందలాల్ 1990 నుంచి మోహనగర్ లో హోంగార్డుగా పని చేశారట. కానీ అంతకుముందే 1984, 1989 కేసులు కూడా నమోదైనట్లు పోలీసుకు సమాచారం వచ్చిందట. అయితే నందాలాల్ విషయంలో పోలీసులు వ్యవహారం కాస్త అనుమానాలకు దారితీసిందట. నందాలాల్ పైన నమోదైన కేసుల పోలీస్ స్టేషన్ కి అతను పని చేస్తున్న మోహనగర్ పోలీస్ స్టేషన్ కి మధ్య కేవలం 15 కిలోమీటర్ల దూరమైనట.


గడిచిన కొన్ని రోజుల క్రితం నందాలాల్ ఒక దాడి ఘటనలో 34 ఏళ్ల విషయాలను బట్టబయలయ్యేలా చేసిందట.. నందాలాల్ మేనల్లుడు డిఐజి వైభవ్ కృష్ణకు ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. అందులో నందలాల్ అసలు పేరు పోలీస్ రికార్డులలో ఉందని తన పేరు నక్డు అంటూ ఫిర్యాదు చేయడం జరిగిందట. అలా డిజిపి కూడా దర్యాప్తు చేయమని ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు విచారించారు. గతంలో రౌడీ షీట్ ఉండేదని తెలియడంతో అతడిని వెంటనే అరెస్టు చేశారు. అయితే నిందితుడు ముందుగా తన పేరు మార్చుకొని సర్టిఫికెట్లలో కూడా పేర్లను మార్పించడంతో పోలీసులు గుర్తించలేకపోయారట. అలా 1990లో హోంగార్డు ఉద్యోగాన్ని కూడా సాధించారట.

నక్డు చదివింది నాలుగవ తరగతి అని ఫేక్ సర్టిఫికెట్లతో హోంగార్డు ఉద్యోగం సాధించారంటూ అక్కడ ఎస్పీ తెలిపారు. 2024 అక్టోబర్లో నందలాల్ స్వగ్రామంలో తమ బంధువులతో గొడవలు పడడంతో ఈ విషయం బయటపడిందట.. 1984లో ఒక హత్య కేసు నక్డు మీద నమోదు కావడంతో ఈ ఫిర్యాదులు 1988లో గ్యాంగ్స్టర్ యాక్టు కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక అతని నెంబర్ 52A అన్నట్టుగా నాటి రికార్డులను తెలుపుతున్నాయట. నందాలాల్ ప్రస్తుత వయసు 57 ఏళ్లు త్వరలోనే ఉద్యోగం నుంచి కూడా రిటైర్ కాబోతున్నారట. ఇలాంటి సమయంలో ఈ వ్యవహారం బయటికి రావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. నందాలాలకు ఉద్యోగం ఇచ్చేటప్పుడు యూపీ ప్రభుత్వం తన బ్యాక్ గ్రౌండ్ ని వెరిఫికేషన్ చేయకుండానే సర్టిఫికెట్ ఇచ్చిందా అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: