ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభమేళా సోమవారం జనవరి 13వ తేదీన అట్టహాసంగా ప్రారంభమైంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరిగే ఈ కార్యక్రమానికి లక్షలాదిమంది సాధువులు, భక్తులు త్రివేణి సంగమంలో దిగి స్నానాలు ఆచరిస్తారు. సుమారుగా 1.5 కోట్ల మంది భక్తులు మహాకుంభమేళాకి హాజరయ్యారని సమాచారం. ముఖ్యంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమముగా గుర్తింపు తెచ్చుకున్న ఈ మహా కుంభమేళా సుమారుగా 45 రోజులపాటు సాగుతుంది. దేశ విదేశాల నుంచి 45 కోట్ల మంది భక్తులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని అంచనా.

ఫిబ్రవరి 26 వరకు జరిగే ఈ మహా కుంభమేళా కోసం ప్రపంచంలో ఉన్న సాధువులు, భక్తులు తండోపతండాలుగా ప్రయాగ్ రాజ్ కు తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే కుంభమేళాకు సంబంధించిన పలు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో భాగంగానే సాధ్వి వేషంలో ఉన్న ఒక ప్రముఖ నటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఫోటోలు, సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతూ ఉండడం గమనార్హం. ఇక ఆమె ఎవరో కాదు హర్ష రిచార్య. ఉత్తరాఖండ్ స్వస్థలం.  ఈ సందర్భంగా ఆమె గతాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించింది.  నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఎందుకు సాధువు అయ్యావు అని ప్రశ్నించగా.. ఆమె ఇలా తన సమాధానం తెలిపింది.

నేను ఉత్తరాఖండ్ నుంచి వచ్చాను. ఆచార్య మహా మండలేశ్వరుని శిష్యురాలిని. ప్రస్తుతం నా వయసు 30 ఏళ్లు.  నేను నా జీవితంలో ఎన్నో చూశాను. నటించాను. యాంకరింగ్ చేశాను. దేశ విదేశాలు కూడా తిరిగాను.  అయితే జీవితంలో మనశ్శాంతి లభించలేదు. అందుకే ఆధ్యాత్మిక యాత్ర వైపు మళ్లాను అంటూ చెప్పుకొచ్చింది హర్ష విచార్య. అయితే తనను సాధ్వి అని పిలవద్దంటూ కూడా రిక్వెస్ట్ చేస్తోంది. నిజానికి ఈమెను చూసిన చాలా మంది సోషల్ మీడియాలో సాద్వి అని ట్యాగ్ పెట్టడంతో ఇది ఏమాత్రం కరెక్ట్ కాదని,  ఎందుకంటే తాను ఇంకా పూర్తి సాధ్వి గా మారలేదు అని కూడా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: