సాధారణంగా ఎక్కడైనా సరే పందెంలో ఓడిపోయిన కోడి మరణిస్తుంది.. లేకపోతే తీవ్ర గాయాల పాలవుతూ ఉంటుంది. ఇలా మరణించిన కోడి పుంజు మాంసం ధర కొంతమంది వెయ్యి లేదా రెండు వేల రూపాయలు వర్క్ పెడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు చచ్చిన పందెంకోడి ధర కూడా రికార్డు స్థాయిలో ధర పలకడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పందెంలో ఓడిపోయిన పుంజును సైతం వేలం వెయ్యక దీన్ని ధర అక్షరాల.. ఒక లక్ష 11 వేల 111 రూపాయలకు కొనుగోలు చేశారట. మరి ఆ కోడిపుంజులో ప్రత్యేకత ఏముందో చూద్దాం.


చాలా చోట్ల వినాయక చవితి, దేవి నవరాత్రుల పర్వదినాలలో మాత్రమే కొన్ని ప్రాంతాలలో లడ్డు వేలం పాటు నిర్వహిస్తూ ఉంటారు. వీటిని కొంతమంది కొన్ని లక్షల రూపాయలు పెట్టి కొంటూ ఉంటారు. అయితే ఇప్పుడు తాజాగా చనిపోయిన కోడిపుంజు వేలం సంక్రాంతి సమయంలో వేలం పాట వేయడంతో లక్ష రూపాయలకు పైగా పలకడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా పందెలకు ముందు ఐదు నెలల పాటు పుంజును చాలా బలమైన ఆహారంతో జీడిపప్పు, బాదం ,ఎగ్ చికెన్ ,మటన్ కీమా వంటి వాటితో పెంచుతారట.

 
దీంతో కోడిపుంజు చాలా బలంగా తయారవుతుంది. అయితే పోరాటంలో చనిపోయిన తర్వాత అదే కోడిపుంజుని  కోజా గా పిలుస్తారట. అయితే ఇలాంటి మాంసాన్ని ఎవరూ కూడా పందెం రాయుళ్లు ఇవ్వరట.అధికారులు, ప్రజాప్రతినిధులు బంధువులు కుటుంబ సభ్యులు మాత్రమే పంచుకుంటారట. అయితే సాధారణ కోడి మాంసం కంటే ఇది చాలా రుచిగా ఉంటుందని గోదావరి దొరికే పులసల కోసం చాలామంది తహతహలాడుతూ ఉంటారు. అయితే ఏలూరు ఎన్ఆర్ పేటకు చెందిన రాజవంశీకులు కోడిపుంజులు సైతం పెడుతూ ఉంటారు. గెలిచిన వారికి ఓడిపోయిన పుంజు సొంతమవుతుంది. ఒకవేళ వీటిని ఇతరులు కొనాలి అంటే డబ్బులు ఇచ్చి వెనక్కి తీసుకోవచ్చట. ప్రస్తుతం మరణించిన కోడి లక్ష రూపాయలకు పైగా పోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: