సంజయ్ రామ్ తల్లి మాలతీరాయ్ మాట్లాడుతూ తన కొడుకు తప్పు చేస్తే కచ్చితంగా అందుకు తగిన శిక్ష విధించాలని తనకు కూడా ముగ్గురు కుమార్తెలు ఉన్నారని తన కుమారుడు తప్పు చేసింది ఒక మహిళగా ఎప్పటికీ ఆ విషయాన్ని క్షమించలేను అంటూ తెలియజేసింది. ఆ మహిళ డాక్టర్ పడినటువంటి నరకాన్ని, బాధలు తాను కూడా అర్థం చేసుకోగలనని వెల్లడించింది. ఒక అమ్మాయి పట్ల ప్రవర్తించిన ఇలాంటి క్రూరమైన వారికి సమాజంలో జీవించే హక్కు లేదని సంజయ్ రామ్ తల్లి వెల్లడించింది. తనకు మరణశిక్ష విధించిన కూడా తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ కూడా వెల్లడించారు.
సంజయ్ రామ్ తల్లి ఇంకా మాట్లాడుతూ .. ఆ చనిపోయిన వైద్యురాలు కూడా తన కూతురితో సమానమని కుమార్తెకు ఇలాంటి పరిస్థితి వస్తే ఏ ఒక్కరు తల్లిదండ్రులు ఊరుకోరని.. అయితే ఈ కేసు పై సుప్రీంకోర్టుకు వెళ్తారా అంటూ మీడియా సంజయ్ సోదరుని అడగగా.. తమకు అలాంటి ఉద్దేశం లేదంటు క్లారిటీ ఇచ్చిందట. అతడు ఇలాంటి దారుణానికి ఒడిగడతారని తాము అనుకోలేదని.. కానీ నేరం జరిగిన ప్రాంతంలో సంజయ్ తో పాటుగా మరి కొంతమంది ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయని ఈ విషయం పైన అటు అధికారులు సిబిఐ చాలా క్షుణ్ణంగా దర్యాప్తు చేసి శిక్ష విధించాలని తెలిపింది. మరి సంజయ్ రాముకు ఎలాంటి శిక్ష విధిస్తారో సిల్దా కోర్టు ఈరోజు తేల్చనంది. గత ఏడాది ఆగస్టు 10వ తేదీన మహిళ వైద్యురాలని అత్యాచారం చేశారు. ఈ ఘటన జరిగి 162 రోజుల తర్వాత కేసులో ఇప్పుడు తీర్పు వెలుబడనుంది.